Ads
నటులు అంటే కేవలం సినిమాల్లో నటించడం అనే విషయంలో మాత్రమే నిపుణులు అయ్యి ఉండరు. వారికి ఇంకా చాలా విషయాలు వచ్చి ఉంటాయి. కొంత మంది నటులు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, సింగర్లు, మంచి డాన్సర్లు కూడా అవుతారు. మరి కొంత మంది సినిమా రంగంలో కాకుండా ఇతర రంగాల్లో కూడా రాణిస్తూ ఉంటారు. ఇప్పుడు ఉన్న చాలా మంది హీరోలు, హీరోయిన్లలో కొంత మంది క్రీడా నేపథ్యం నుండి వచ్చిన వారు ఉన్నారు. కొంత మంది చదువులలో టాపర్ అయ్యి ఉన్నారు. కానీ సినిమా కోసం వారు చాలా కష్టపడ్డారు.
అందుకే ఇప్పుడు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పెట్టినప్పుడు చాలా మంది హీరోలు, సినిమా రంగంలో ఉన్న వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉంటారు. వాళ్లు అలా క్రికెట్ ఆడుతూ ఉన్నప్పుడు వీళ్ళకి ఆట ఇంత బాగా వస్తుందా అని జనాలు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు పైన ఫోటోలో ఉన్న నటి చదువుకుంటున్న రోజుల్లో బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అవార్డు అందుకున్నారు. ఆ సమయంలోనే ఇలా ఫోటో తీశారు. ఆ నటి సినిమాల్లో రాణించడం మాత్రమే కాకుండా, రాజకీయాల్లో కూడా ఎంతో గొప్ప పదవికి వెళ్లారు. నటి జయలలిత గారు తెలియని వారు ఉండరు. ఆమెని తలైవి అని పిలుచుకుంటారు. కొంత మంది అమ్మ అని కూడా అంటారు. ఒక నటికి ఇంత ఆప్యాయత దక్కడం అనేది చిన్న విషయం కాదు. లలిత గారు మల్టీ టాలెంటెడ్.
Ads
చిన్నప్పుడు చదువులో ముందు ఉండడం మాత్రమే కాకుండా, టెన్నిస్ కూడా చాలా బాగా ఆడేవారు. అన్ని రంగాల్లో ముందు ఉండేవారు. అందుకే జయలలిత గారి ప్రతిభకి మెచ్చి స్కూల్ యాజమాన్యం బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అవార్డు ఇచ్చారు. జయలలిత గారి తల్లి సంధ్య గారు కూడా జయలలిత గారు హీరోయిన్ అవ్వడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. కూతురు కోసం చాలా కష్టపడ్డారు. జయలలిత గారు మంచి హీరోయిన్ అవ్వాలి అని ఎంతో కృషి చేశారు. జయలలిత గారికి, సంధ్య గారికి మధ్య చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంది. జయలలిత గారు సినిమాల్లో పేరు తెచ్చుకున్న తర్వాత రాజకీయాల్లో కూడా రాణించారు. ఇప్పటికి కూడా జయలలిత గారి గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటారు.