Ads
తిరుమల వెళ్ళిన భక్తులందరూ కూడా హుండీలో డబ్బులు వేస్తూ ఉంటారు తిరుమల కి విదేశీ భక్తులు కూడా వస్తూ ఉంటారు. వాళ్లు కూడా హుండీలో నగదు, ఖరీదైన కానుకలు సమర్పిస్తూ ఉంటారు. విదేశీ కరెన్సీ ని టీటీడీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా భారత కరెన్సీ లోకి మార్చుకుంటుంది. 2018 తర్వాత నుండి విదేశీ కరెన్సీని అలా మార్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పుకోలేదు. అలానే దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలో డిపాజిట్ చేయడానికి కూడా ఒప్పుకోలేదు.
2018 నుండి ఇప్పటి దాకా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద విదేశీ కరెన్సీ నిల్వలు పేరుకుపోయాయి. వాటి విలువ 30 కోట్ల వరకు ఉందని టీటీడీ అంటోంది. విదేశీ భక్తులు హుండీలో సమర్పించే విరాళాలను పొందడానికి టీటీడీ కేంద్ర హోంశాఖ నుంచి ఎఫ్‌సీఆర్ఏ చట్టం కింద లైసెన్స్ ని తీసుకుంది.
ఎఫ్‌సీఆర్ఏ అంటే ఏమిటంటే.. ఫారిన్ కాంట్రిబ్యూషన్(రెగ్యులేషన్) యాక్ట్, 2010. విదేశీ కరెన్సీని ఆర్‌బీఐ 2018 వరకూ ఈ చట్టం కింద అనుమతి ఇచ్చింది. ఎస్బీఐ కూడా ఆ కరెన్సీని టీటీడీ ఖాతాలో డిపాజిట్ చేస్తూ ఉండేది. 2018లో లైసెన్స్ గడువు పూర్తై పోయింది. రెన్యువల్ చేసుకోలేదు. లైసెన్స్ రెన్యువల్ చేసుకోకుండా టీటీడీ ఆ విరాళాలు సేకరించండం పై రూ.1.14 కోట్ల జరిమానా విధించింది. 2020లో ఈ చట్టానికి సవరణలూ చేసారు.
Ads
దాని ప్రకారం విదేశీ విరాళాలపై వచ్చే వడ్డీని ఆయా సంస్థలు వాడకూడదు. కానీ టీటీడీ ఆ మొత్తాన్ని వినియోగించడం.. ఆదాయ వివరాలు కూడా సరిగ్గా లేకపోవడం వలన తాజాగా మరో రూ.3.19 కోట్ల జరిమానా విధించింది. ఇలా కేంద్రం రూ.4.33 కోట్ల జరిమానా విధించింది. ”ఫారిన్ కరెన్సీ మార్చడానికి ఆర్బీఐ లైసెన్స్ ఉండేది. అయితే 2018లో రద్దు చేశారు.
విదేశీ కరెన్సీనీ గత ఐదేళ్లుగా తీసుకోలేదు. ఆ డబ్బు దాదాపు రూ.30 కోట్లకు పెరిగింది. అప్పట్లో పత్రాలు సంగతి తెలీదు ఇప్పుడు మేం సహకరిస్తాం అన్నాము. గతంలో జరిగిన దానికైతే రూ.3 కోట్లు కూడా కట్టాం” అని టీటీడి చెప్తోంది. టీటీడీ విజ్ఞప్తి మేరకు 2020 జనవరి నుంచి 2025 జనవరి వరకు లైసెన్స్ ని ఇప్పుడు ఇచ్చారు. లైసెన్సు రెన్యువల్ తో స్టేట్ బ్యాంక్ దగ్గర ఉన్న రూ.30 కోట్ల విదేశీ కరెన్సీ టీటీడీ ఖాతాలో డిపాజిట్ అవుతుంది.