Ads
జీవిత సత్యాలను మత్రమే కాకుండా జీవితంలో ప్రతి ఒక్కరూ పాటించాల్సిన విషయాలనూ ఆచార్య చాణక్యుడు చక్కగా వివరించారు. కాలంతో సంబంధం లేకుండా చాణక్య నీతి ఎల్లప్పుడూ మంచి దారిని చూపిస్తుంది.
Ads
పరిస్థితులకు అనుగుణంగా ఆచార్య చాణక్యుడు ఎప్పుడో చెప్పిన మాటలు ఎల్లప్పుడూ ఆచరణీయమే. ప్రధానంగా ఆచార్య చాణక్య మనుషుల వ్యవహార శైలికి చెందిన విషయాల గురించి చెప్పిన ప్రతి మాట కూడా నిజాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఇక భర్తలు భార్యలతో ఎలా ఉండాలి అనే విషయంలో చాలా సూచనలు చేశారు. ఒక భర్త ఎప్పుడూ కూడా తనకు సంబంధించిన 4 విషయాల గురించి భార్యకు చెప్పకూడదు. అలా చెప్పడం వల్ల ఇబ్బందులు వస్తాయని చాణక్య అంటారు. మరి భర్త, భార్యకు చెప్పకూడని ఆ 4 విషయాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
1. ఆదాయం:
తన ఆదాయం ఎంత అనేది భర్త తన భార్యకు చెప్పకూడదని చాణక్య నీతి. దానికి కారణం భర్త సంపాదన భార్యకు తెలిసినట్లయితే ఆ ఇంట్లో అనవసరమైన ఖర్చులు పెరుగుతాయట. అలా ఒక్కోసారి ఖర్చు భర్త సంపాదనకి మించి పెరిగే అవకాశం ఉంటుంది. తన భర్త సంపాదన ఎక్కువ అని తెలిస్తే ఆ భార్య ఖర్చు కూడా ఎక్కువగా పెట్టడం మొదలుపెడుతుందని చెప్పారు ఆచార్య చాణక్య. అందువల్లే భర్త తన ఆదాయం ఎంత అనేది భార్యకు చెప్పకూడదు.
2.బలహీనత:
ప్రతి ఒక్కరికీ ఏదో ఒక బలహీనత ఉంటుంది. అయితే తన బలహీనత గురించి భర్త తన భార్యకు ఎప్పుడూ చెప్పకూడదు. ఎందుకంటే సహజంగానే భార్య భర్త యొక్క బలహీనత తరచుగా ప్రస్తావిస్తూ ఉంటుంది. ఆ బలహీనతను భర్త అధిగమించాలని ప్రయత్నించిన కూడా అటువైపునకు అతని అడుగు పడకుండా చేస్తుంది. అంతేకాకుండా భార్య పదే తరచుగా బలహీనత గురించి భర్తకు గుర్తు చేసినట్లయితే ఆ భర్తలో ఆత్మన్యూనతా భావం కలుగుతుంది. ఇది చాలా అనర్ధాలకు కారణం అవుతుంది.
3.అవమానం
భర్త ఎలాంటి పరిస్థితుల్లో అయినా తాను పొందినటువంటి అవమానం గురించి భార్యకు చెప్పకూడదు. ఆ విషయం భార్యకు తెలుస్తుందో అప్పటి నుండి భార్య ఆ భర్తను తక్కువగా చూడటం మొదలుపెడుతుంది. ఇది ఆ జంట దాంపత్యంలో మనస్పర్ధలకు దారి తీస్తుంది. ఇక ఆ భర్త పొందిన అవమానం కన్నా ఎన్నో రెట్లు తన భార్య వద్ద అవమానం పొందాల్సి వస్తుంది. అందువల్ల భర్త తాను పొందినటువంటి అవమానాన్ని ఎప్పుడూ తన భార్యకు తెలియకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది.
4.చేయాలనుకునే సహాయం:
భర్త ఎవరికి అయిన సహాయం చేయాలి అనుకున్నప్పుడు నిశ్శబ్దంగా చేయాలి. తన భార్యకు చెప్పకూడదని చాణక్య నీతి. ఒకవేళ భర్త తాను చేసే సహాయాం గురించి భార్యకు చెప్పినట్లయితే ఇబ్బందులు ఎదురవుతాయి.చేసే సహాయాన్ని చేయకుండా భార్య అడ్డుపడవచ్చు. లేదా ఒక్కోసారి భర్త సాయం చేయలేనిస్థితిలో ఉన్నప్పటికి భార్య ఎవరికి అయిన సాయం చేయాలని ఆడవచ్చు. అప్పుడు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది.
Also Read: రాజులని ఆకర్షించేందుకు రాణీలు వారి అందాన్ని ఇలా పెంచుకునేవారని.. మీకు తెలుసా..?