రాజులని ఆకర్షించేందుకు రాణీలు వారి అందాన్ని ఇలా పెంచుకునేవారని.. మీకు తెలుసా..?

Ads

ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని అనుకుంటారు. అందంగా ఉండేందుకు వివిధ రకాల పద్ధతుల్ని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మార్కెట్లో మనకి వివిధ రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటాయి. ఈ ప్రొడక్ట్స్ వల్ల హాని కలుగుతుంది అని మనకి తెలిసినా సరే మనం వాటిని ఉపయోగిస్తూ ఉంటాము. కేవలం చర్మం డామేజ్ అవ్వడం మాత్రమే కాకుండా వయసు కూడా త్వరగా పైబడి పోతున్నట్లు చర్మం మారిపోతుంది. అయితే ఈ కాలంలోనే కాదు రాజులు రాణిలు ఉన్నప్పటి నుండి కూడా అందంపై ఆడవాళ్లు శ్రద్ధ పెట్టేవారు.

రాణీలు చాలా అందంగా కనపడడానికి రాజులని అట్రాక్ట్ చేయడానికి చూస్తుండేవారు. అయితే అప్పుడు అందంగా కనపడడానికి రాణులు ఎలాంటి చిట్కాలని ఉపయోగించేవారు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అందమైన చర్మం కోసం రాజ్ వైద్య ఈ చిట్కాలను చెప్పారు.

  1. గాడిద పాలతో స్నానం:

గాడిద పాలతో స్నానం చేయడం వలన రాణీలు మరింత అందంగా మారడానికి అవుతుంది. గాడిద పాలల్లో చక్కటి గుణాలు ఉంటాయి. గాడిద పాలలో కొంచెం తేనే, ఆలివ్ ఆయిల్ వేసుకుని స్నానం చేస్తే చర్మాన్ని అందంగా మార్చుకోవచ్చు. తేనే ఆలివ్ ఆయిల్ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. చర్మానికి జుట్టుకి కూడా ఇది బాగా పనిచేస్తుంది. అందమైన కురులు కోసం ఈ చిట్కాని ప్రయత్నం చేసేవారు రాణీలు.

Ads

2. అవకాడో మాస్క్:

అవకాడో కూడా బాగా పనిచేస్తుంది. డార్క్ స్పాట్స్, పింపుల్స్ వంటి ఇబ్బందుల్ని తొలగిస్తుంది. అందంగా ఉండడానికి రాణీలు అవకాడోలని తీసుకునేవారు.

3. బీర్:

వాళ్లకి నచ్చిన మగవారిని ఆకర్షించేందుకు.. ఇంప్రెస్ చేసేందుకు ఆ మగవారికి నచ్చిన బీర్ తో ఫేస్ ప్యాక్ వేసుకునేవారు. గుడ్లు, నిమ్మరసం, పాలపొడి బీర్ లో మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకునేవారు. ఇలా చేయడం వలన చర్మం మరింత యంగ్ గా కనబడుతుంది.

4. రోజ్ వాటర్:

చర్మానికి రోజ్ వాటర్ చాలా చక్కగా పనిచేస్తుంది. రాణీలు రోజ్ వాటర్ తో స్నానం చేయడం రోజు వాటర్ ని ఉపయోగించడం వంటివి చేస్తుండేవారు.

5. రోజ్ పెర్ఫ్యూమ్:

రాణీలు రాజులని ఆకర్షించేందుకు రోజ్ పెర్ఫ్యూమ్ ని ఉపయోగించేవారు అలానే ఇది చర్మం డ్రై అయిపోకుండా కూడా చూస్తుంది.

6. వాల్ నట్స్:

అందానికి ఆరోగ్యానికి కూడా వాల్ నట్స్ బాగా హెల్ప్ అవుతాయి. రాణీలు అందంగా ఉండేదుకు వీటిని తినేవారు.

Previous article”సైకిల్ సీటు” మధ్యలో ఎందుకు ఇలా ఉంటుంది.. దీని వలన ఇంత ఉపయోగమా..?
Next articleఆగష్టు 15, జనవరి 26న జాతీయ జెండాని ఎగురవేయడం మధ్య ఇంత తేడా ఉందా..? మీకు తెలుసా..?