Ads
సినిమా అన్నాక ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ఎన్నో మార్పులు కూడా చేస్తూ ఉంటారు. అలా ఇటీవల ఒక సినిమాలో చాలా మార్పులు జరిగాయి. ఆ సినిమా పేరు ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు.
అదే. మీరు అనుకున్న సినిమానే. దాదాపు 13 సంవత్సరాల తర్వాత వస్తున్న కాంబినేషన్. దాంతో చాలానే అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా మొదలు పెట్టిన అప్పటి నుండి, ఇప్పటి వరకు గుంటూరు కారం సినిమా విషయంలో మాత్రం ఎన్నో మార్పులు జరిగాయి. ఇప్పుడు కూడా ఏదో ఒక విషయం మీద చర్చ జరుగుతూనే ఉంది. అ మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
# మొదట ఈ సినిమాని ఒక యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలాగా తీయాలి అనుకున్నారు. అందుకు సంబంధించి మహేష్ బాబుకి లుక్ టెస్ట్ చేసి ఒక వీడియో కూడా విడుదల చేశారు. ఆ వీడియోకి తమన్ అందించిన స్టైలిష్ మ్యూజిక్ కూడా బాగుంది. కానీ తర్వాత స్టోరీ మొత్తం మార్చేసి, త్రివిక్రమ్ స్టైల్ ఎమోషనల్ డ్రామాలాగా ఈ సినిమా రూపొందించారు.
# సినిమాకి మొదట ఫస్ట్ హీరోయిన్ పాత్రలో పూజా హెగ్డే అని అనుకున్నారు. కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశారు. అయితే ఆ తర్వాత పూజా ఈ సినిమా నుండి తప్పుకున్నారు. దాంతో పూజా హెగ్డే సీన్స్ అన్నీ కూడా మళ్లీ సెకండ్ హీరోయిన్ గా అనుకున్న శ్రీలీలని ఫస్ట్ హీరోయిన్ చేసి షూట్ చేశారు. ఆ తర్వాత శ్రీలీల పోషిస్తున్న సెకండ్ హీరోయిన్ పాత్రలో మీనాక్షి చౌదరిని సెలెక్ట్ చేశారు. ఆమె మీద మళ్లీ ఆ సీన్స్ షూట్ చేశారు.
# సంగీత దర్శకుడి విషయంలో కూడా బాగానే చర్చలు అయినట్టు సమాచారం. తమన్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తారు అని ముందే ప్రకటించారు. కానీ పాటలు నచ్చకపోవడంతో ఒక దశలో మ్యూజిక్ డైరెక్టర్ ని మార్చేద్దాం అనే నిర్ణయం తీసుకున్నారు అనే వార్త ఒకటి బయటికి వచ్చింది. కానీ చివరికి తమన్ మళ్లీ ట్యూన్స్ మీద పని చేయడంతో తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగారు అని అన్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు.
Ads
# ఫైట్ మాస్టర్ విషయంలో కూడా చాలా మార్పులు జరిగాయి. మొదట విక్రమ్ సినిమాకి పనిచేసిన అన్బారివ్ మాస్టర్ ఈ సినిమాకి పని చేశారు. తర్వాత కథ మార్చడంతో ఫైటింగ్స్ కూడా మార్చాల్సి వచ్చింది. దాంతో రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఈ సినిమాకి మళ్లీ ఫైటింగ్స్ కంపోజ్ చేశారు. కానీ ఆ తర్వాత ఇద్దరు మాస్టర్లు ఈ సినిమాకి పని చేశారు అని అన్నారు. అంటే, అన్బారివ్ మాస్టర్ కొన్ని ఫైట్లు రూపొందిస్తే, రామ్ లక్ష్మణ్ మాస్టర్లు మరికొన్ని ఫైట్స్ రూపొందించారు.
# సినిమాటోగ్రాఫర్స్ కూడా మారారు. మొదట ఈ సినిమాకి పిఎస్ వినోద్ పని చేశారు. తర్వాత మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ చేశారు. పోస్టర్స్ లో కూడా కొన్ని పోస్టర్స్ లో పిఎస్ వినోద్ పేరు ఉంటే, మరి కొన్ని పోస్టర్స్ లో మనోజ్ పరమహంస పేరు ఉంది.
# మొదట సీరియస్ యాక్షన్ సినిమా అనుకున్న సినిమా కాస్త ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా అయిపోయింది. దాంతో కామెడీ ట్రాక్ కోసం హైపర్ ఆది, సునీల్ వంటి వాళ్లు కూడా సినిమాకి యాడ్ అయ్యారు.
# మొదట ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ సాంగ్ దమ్ మసాలా పాటని బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే ఒక పాటలాగా అనుకున్నారు. కానీ తర్వాత మార్చి, ఈ పాటకి ఒక స్పెషల్ సెట్ వేసి, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో సాంగ్ షూట్ చేశారు. అంతే కాకుండా మహేష్ బాబు, మీనాక్షి చౌదరి మీద కేరళలో ఒక సాంగ్ షూట్ ప్లాన్ చేసుకున్నారు. తీరా కేరళ వెళ్ళాక, అక్కడ వాతావరణం సహకరించక, రామోజీ ఫిలిం సిటీలోనే కేరళ లొకేషన్ లాంటి సెట్ వేసి షూట్ చేసినట్టు సమాచారం.
# ఇవన్నీ మాత్రమే కాకుండా, సినిమా విడుదల తేదీ విషయంలో కూడా చాలా మార్పులు జరిగాయి. మొదట జనవరి 13 అని ప్రకటించిన సినిమా, ఆ తర్వాత జనవరి 12 విడుదల అవుతుంది అని ప్రకటించారు. ఇప్పుడు ఇవాళ జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా వాయిదా పడింది. మరి ఈవెంట్ ఎప్పుడు జరుగుతుంది అనేది ప్రకటించాల్సి ఉంది.
ఇలా సినిమాల్లో మార్పులు జరగడం ఇది మొదటి సారి ఏమీ కాదు. కానీ ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా హైదరాబాద్ లో జరగడం వల్ల ఇలాంటి విషయాలు అన్నీ కూడా తొందరగా బయటికి వచ్చాయి.