Ads
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లేదు. 150 సినిమాలకి పైగా నటించి మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు మెగాస్టార్. అలానే మెగాస్టార్ ఫ్యామిలీ నుండి చాలా మంది నటులు కూడా వచ్చారు. టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరుగా నిలబడ్డారు ఇప్పుడు చిరు. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ సినిమాల్లోకి వచ్చారు.
ప్రతి ఒక్క హీరో కెరియర్ లో హిట్లు, ప్లాప్స్ సహజమే. మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో కూడా హిట్స్, ఫ్లాప్స్ ఉన్నాయి. అయితే చిరంజీవి నటించిన హిట్లర్ గురించి ఎన్ని సార్లు చెప్పుకున్న తక్కువే.
చాలా మంచి సినిమా అది. హిట్లర్ సినిమాలో ఎంతో బాధ్యతగా నటించే పాత్ర ఆయనకి వచ్చింది. అందులో ఆయనకు ఐదుగురు చెల్లెళ్లు. ఈ సినిమా 1997 జనవరి 4న విడుదల అయింది. ఇది ఒక మలయాళం సినిమా. అందులో మమ్ముట్టి హీరోగా ఉన్నారు. అయితే ఈ సినిమాను రైట్స్ ని మోహన్ తీసుకున్నారు తర్వాత తెలుగులో రీమిక్స్ చేద్దామని నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాలో హీరోగా మొదట మోహన్ బాబుని అనుకున్నారట. అలానే దర్శకత్వం బాధ్యత ఈవీవీ సత్యనారాయణకి ఇద్దామని అనుకున్నారు కానీ సత్యనారాయణ గారు దానికి ఒప్పుకోలేదు.
Ads
అప్పుడు హిట్లర్ సినిమాకి ముత్యాల సుబ్బయ్యను దర్శకత్వం వహించాలని అడగగా దానికి ఆయన ఒప్పుకున్నారు. అనుకున్నట్టే ఈ సినిమాని చక్కగా తీసుకువచ్చారు. చిరంజీవికి బిగ్ బాస్ సినిమాతో ఫ్లాప్ వచ్చింది తర్వాత గ్యాప్ తీసుకున్నారు. హీరోగా మొదట మోహన్ బాబు ని అనుకున్నా సరే చిరంజీవిని అడిగారు. బిగ్ బాస్ ఫ్లాప్ అవడంతో చిరంజీవి మంచి స్టోరీ కోసం చూస్తున్నప్పుడు.. ఈ కథ ఆయనకి నచ్చి ఒప్పుకున్నారు. ఇలా మోహన్ బాబుని మొదట అనుకుని ఆఖరికి చిరంజీవి హీరోగా హిట్లర్ సినిమా చేసారు. 1997లో విడుదల అయింది ఈ సినిమా. కమర్షియల్ గా కూడా చక్కటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూసి ఫిదా అయిపోయారు.