“నువ్వు బిచ్చగాడివా..?” అనేవాళ్ళు..! అంబానీ అలా చేయడంతో స్కూల్లో కొడుకుని..?

Ads

ఇప్పుడు భారతదేశ మొత్తం ముఖేష్ అంబానీ ఇంట జరిగే పెళ్లి వేడుకల గురించే మాట్లాడుకుంటున్నారు. కొడుకు పెళ్లి కోసం ముఖేష్ అంబానీ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం గురించి చర్చించుకుంటున్నారు.

ధనవంతుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడు అని అసూయ పడుతున్నారు కూడా. అలాంటి అపర కుబేరుడు కొడుకు అనంత్ అంబానీని తను ఫ్రెండ్స్ బికారి వాడంటూ ఏడిపించే వారంట. ఇప్పుడు ఈ వార్త తెగ వైరల్ అవుతుంది. అంబానీ కొడుకు ఏంటి, బికారి ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు.

why did anant ambani gain weight

అయితే విషయం ఏమిటంటే అనంత్ అంబానీ చదువుకునే రోజుల్లో తన స్కూల్లో తోటి స్నేహితులు తనని బికారి అని ఎగతాళి చేసేవారట. దానికి కారణం అనంత అంబానీ పాకెట్ మనీ ఐదు రూపాయలు మాత్రమే కావటం. నిజమేనండి ముకేశ్ అంబానీ దంపతులు పిల్లలకి డబ్బులు విలువ తెలియటం కోసం వాళ్లకి కేవలం ఐదు రూపాయలు పాకెట్ మనీ మాత్రమే ఇచ్చేవారంట. ధీరుభాయ్ అంబానీ స్కూల్లో చదువుకున్న అనంత్ అంబానీ క్యాంటీన్లో ఖర్చు చేయటానికి 5 రూపాయలు తీసుకువెళ్తే తోటి విద్యార్థులంతా తూ అంబానీ హై యా బికారీ అని ఎగతాళి చేసేవారట.

Ads

why did anant ambani gain weight

ఈ విషయాన్ని స్వయంగా అనంత్ అంబానీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. తర్వాత ఆ విషయం తెలుసుకున్న ముఖేష్ అంబానీ దంపతులిద్దరూ షాక్ అయ్యారట. అయితే అపర కుబేరులు అయినప్పటికీ ముఖేష్ అంబానీ దంపతులు పిల్లల పెంపకం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. వారికి మంచి ప్రవర్తన, వినయం, సాంప్రదాయాలని నేర్పుతూ పెంచి పెద్దవాళ్ళని చేశారు.

why did anant ambani gain weight

అనంత్ అంబానీ బ్రౌన్ యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి ప్రస్తుతం అనేక రిలయన్స్ వెంచర్లకు డైరెక్టర్ గా ఉన్నాడు. ఇతని నికర ఆస్తుల విలువ 40 మిలియన్ డాలర్లు అని సమాచారం. ఇతను ప్రస్తుతం రిలయన్స్ O2C, న్యూ సోలార్ ఎనర్జీకి డైరెక్టర్ పదవిలో ఉన్నాడు. ఇక తండ్రి 969295 కోట్ల భారీ నికర సంపదతో దేశంలోనే అత్యంత ధనవంతుడు అన్న విషయం అందరికీ తెలిసిందే.

Previous articleవెంకటేష్ ”నువ్వు నాకు న‌చ్చావ్” మూవీని ఎన్నోసార్లు చూసినా ఈ మిస్టేక్ ని గ‌మ‌నించ‌లేదు..!
Next articleమోహన్ బాబు తో చెయ్యాల్సిన ”హిట్లర్” సినిమాను.. చిరు తో చేయడానికి కారణం ఇదే..!
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.