Ads
సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలని ప్రజలు మెచ్చుకుంటున్నారు. రేవంత్ రెడ్డి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అందరూ రాజకీయ నాయకులు మాటిస్తారు కానీ నిలబెట్టుకోవచ్చు నిలబెట్టుకోకపోవచ్చు. ఒకవేళ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు అంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయని చిన్న పిల్లలు సైతం అర్థం చేసుకోగలరు.
అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తను నిన్న ఇచ్చిన మాటని ఈరోజు నెరవేర్చుకొని అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే సాధారణ ట్రాఫిక్ లోనే తన కాన్వాయ్ ప్రయాణిస్తుందని శుక్రవారం సబాముఖంగా చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి అయితే దాన్ని ఈరోజే ఆచరణలో పెట్టి చూపించారు. తన కాన్వాయ్ వెళుతున్న సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Ads
అలాగే తనకి కూడా ఎటువంటి ట్రాఫిక్ జామ్ లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తనకోసం ట్రాఫిక్ ఆపకూడదని వాహనదారులని ఇబ్బంది పెట్టొద్దని పోలీసులకు చెప్పారు. సీఎం కాన్వాయ్ లో 15 వాహనాల నుంచి 9 వాహనాలకు తగ్గించామని చెప్పారు. అయితే రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుంది అని చాలామంది లైట్ తీసుకున్నారు, అవన్నీ గాలి మాటలు అని కొందరు తీసి పారేశారు.
వాళ్లందరూ అభిప్రాయాలని తలకిందులు చేస్తూ ఈరోజు సీఎం కాన్వాయ్ సాధారణ ట్రాఫిక్ లోనే జూబ్లీహిల్స్ లోని తన సొంత నివాసం నుంచి చెక్పోస్ట్, నాగార్జున సర్కిల్,పంజాగుట్ట, ఖైరతాబాద్ కూడల్ల మీదుగా అసెంబ్లీకి ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా సాధారణ ట్రాఫిక్ లోనే ప్రయాణించి అందరికీ షాక్ ఇచ్చారు. ఎటువంటి రోడ్డు బ్లాక్స్ లేకుండా సాధారణ వెహికల్స్ తో పాటు సీఎం కాన్వాయ్ అసెంబ్లీకి చేరుకుంది. దీంతో చాలామంది ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.