“అసలు ఈ హీరోని అలాంటి పాత్రలో ఎందుకు పెట్టారు..?” అంటూ… “నాగ్ అశ్విన్” మీద కామెంట్స్ ఆ హీరో ఎవరంటే..?

Ads

కల్కి 2898 ఏడి సినిమాలో చాలా మంది ప్రముఖ నటీనటులు అతిధి పాత్రల్లో కనిపించిన సంగతి తెలిసిందే. వారిలో కొంత మంది పేర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వచ్చేసాయి. సినిమా రిలీజ్ అయ్యేముందే ఏ పాత్ర ఎవరు చేస్తున్నారు అనే విషయం బయటకు వచ్చింది. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది ఇద్దరు హీరోల పేర్లు. ఒకరు దుల్కర్ సల్మాన్ అయితే, ఇంకొకరు విజయ్ దేవరకొండ. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా తర్వాత, మహానటి సినిమాలో కూడా విజయ్ దేవరకొండ నటించారు.

comments on this role in kalki 2898 ad

ఇప్పుడు అదే సెంటిమెంట్ ఫాలో అవుతూ ఈ సినిమాలో కూడా విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్రలో నటించారు. ఈ విషయం ఇంతకుముందే బయటికి వచ్చేసింది. సినిమా చూస్తున్నంత సేపు విజయ్ దేవరకొండ పాత్ర మీద కామెంట్స్ వచ్చాయి. విజయ్ దేవరకొండ కనిపించేది కొంచెం సేపు అయినా కూడా, విజయ్ దేవరకొండ డైలాగ్ డెలివరీ పౌరాణికాలకు తగ్గట్టు లేదు అంటూ కామెంట్స్ చేశారు.

Ads

అర్జున్ రెడ్డి, వరల్డ్ ఫేమస్ లవర్ లో కోపంగా ఎలా అయితే మాట్లాడారో, ఈ సినిమాలో కూడా అలాగే మాట్లాడారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాకి తగ్గట్టుగా డైలాగ్ డెలివరీ మార్చుకోవాలి. గత కొద్ది సినిమాల నుండి విజయ్ దేవరకొండ డైలాగ్ డెలివరీ మీద ఇలాంటి కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. ఏ సినిమాలో అయినా కూడా, పాత్రకి తగ్గట్టు విజయ్ దేవరకొండ మారరు అని చాలామంది అంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమాలో అర్జునుడి పాత్రకి విజయ్ దేవరకొండ అస్సలు సూట్ అవ్వలేదు అని అంటున్నారు.

విజయ్ దేవరకొండకి బదులు రానా దగ్గుబాటిని తీసుకొని ఉంటే డైలాగ్ డెలివరీ ఇంకా చాలా బాగుండేది అని అంటున్నారు. డైలాగ్ పవర్ ఫుల్ గా ఉన్నా కూడా విజయ్ దేవరకొండ చెప్పిన విధానం వల్ల ఆ డైలాగ్ అంత బాగా తెర మీద కనిపించలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ పాత్రకి విజయ్ దేవరకొండని కాకుండా అదే సినిమాలో నటించిన దుల్కర్ సల్మాన్ ని తీసుకున్నా కూడా బాగుండేది అని అంటున్నారు. విజయ్ దేవరకొండ పోషించిన పాత్రని దుల్కర్ సల్మాన్ పోషిస్తే, దుల్కర్ సల్మాన్ పోషించిన పాత్రని విజయ్ దేవరకొండ పోషిస్తే కూడా బాగుండేది అని కామెంట్స్ చేస్తున్నారు.

Previous articleమూడు సీజన్స్ సూపర్ హిట్… ఇండియాలోనే బెస్ట్ వెబ్ సిరీస్ అంటే ఇదే..! ఏం ఉంది ఇందులో..?
Next articleచనిపోయాక కొన్ని మతాల్లో పూడ్చేస్తారు.. దాని వెనుక కారణం ఏమిటి అంటే..?