Ads
పుట్టడం చనిపోవడం రెండూ మన చేతుల్లో లేవు. పుట్టిన వాళ్లకి ఏదో ఒక రోజు మరణం వస్తుంది అయితే అది ఎప్పుడు వస్తుందనేది ఎవరికీ తెలీదు. పుట్టిన తర్వాత నుండి మరణం వరకు ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో కష్టసుఖాలని ఎదుర్కొంటూ ఉంటారు. కష్టం సుఖం రెండు కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటూ ఉంటాయి.
మరణం నిజంగా బాధాకరమైనది మనకి ఇష్టమైన వాళ్ళు మనం ప్రేమించిన వాళ్ళు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతే దానిని మనం తట్టుకోవడం కష్టం. ఆస్తికుడు చనిపోయిన తర్వాత దేవుడు దగ్గరికి వెళ్లాలని తపన పడుతూ ఉంటాడు అదే నాస్తికుడు అయితే శరీరం భూమిలో కలిసిపోతుందని వాదిస్తూ ఉంటాడు.
మరణం గురించి ఒక్కొక్కరిలో ఒక్కొక్క భావన ఉంటుంది. పైగా మతాల్లో కూడా మరణానికి అర్థాలు వేరుగా ఉంటాయి. మన శరీరం, ఆత్మ చనిపోయాక ఎటు వెళుతుంది.. ఏం జరుగుతుంది.. ఆత్మ అనేది ఉందా లేదా ఇలాంటివన్నీ కూడా చాలామంది మెదడులో మెదిలే ప్రశ్నలే. హిందూమతంలో చూస్తే భగవద్గీతలో శ్రీకృష్ణుడు మరణం అంటే.. ఆత్మ ఒక శరీరాన్ని వీడి మరో శరీరాన్ని ధరించడం. శరీరం అనేది ఆత్మకి ఒక వస్త్రం వంటిది. ఎలా అయితే దేహం ఒక వస్త్రాన్ని విడిచాక మరో వస్త్రాన్ని ధరిస్తుందో ఆత్మ కూడా ఒక శరీరాన్ని విడిచి మరో శరీరాన్ని ధరిస్తుంది. అది పునర్జన్మ.
Ads
గరుడ పురాణంలో ఆత్మ గురించి ఆత్మగమనం గురించి వివరించారు దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఆత్మ శరీరాన్ని విడిచిన తర్వాత ప్రాణం పోతుంది. పాపాలు ఎక్కువగా చేస్తే వారి ఆత్మ భూమి మీద శరీరాన్ని విడిచిపెట్టి మరో శరీరాన్ని వెంటనే ధరించేస్తుంది. దీని యాతన శరీరం అంటారు. నొప్పులుని అనుభవించడానికి ఉంటుంది ఇది అని అంటారు. ఎంతటి నొప్పి కలిగిన కూడా శరీరానికి చావు ఉండదు. నూనెలో కాల్చినా మంటలో పడేసిన చావు రాదని అంటారు ఈ యాతన శరీరానికి కూడా ఆకలి దప్పిక కలుగుతుంది అందుకనే చనిపోయిన వాళ్లకి పిండ ప్రతాపం ప్రధానం చేస్తూ ఉంటారు.
యాతన శరీరం పిండం మీదనే ఆధారపడి ఉంటుంది. శరీరం 13 రోజులపాటు ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. యమ భటులు వచ్చి యమలోకానికి తీసుకువెళ్తారు యమలోకానికి వెళ్లడానికి 308 రోజులు పడుతుంది. దారి పొడుగునా కొడుతూ ఉంటారు. యమలోకానికి వెళ్ళిన తర్వాత కాలయముడిగా కనపడతాడు చిత్రగుప్తుడు పాపాల లెక్కలని బయటకు తీసిన తర్వాత శిక్ష వేస్తాడు. ఒక్కో రకమైన తప్పుకి ఒక్కొక్క శిక్ష ఉంటుంది. అదే పుణ్యాత్ముడికి యమలోకంలో స్వాగతం పలుకుతారు.
దారి పొడవునా కూడా హింసించారు. స్వర్గానికి మర్యాదలతో పంపుతారు హిందూ ధర్మం ప్రకారం చనిపోయిన తర్వాత ఇలా జరుగుతుందని అంటూ ఉంటారు. అదే ఇస్లాం ప్రకారమైతే కుడి ఎడమ భుజాల మీద మనకు కనపడకుండా ఇద్దరు ఉంటారు వారు పాపపుణ్యాలను ఎప్పటికప్పుడు లెక్కపెడతారట. చనిపోయిన తర్వాత వేరే మతాల్లో భూమిలో పాతి పెట్టేస్తుంటారు. వాళ్లని కాల్చారు. పాపాలు చేసిన వాళ్ళు నరకానికి వెళ్లి శిక్షలు అనుభవిస్తే పుణ్యాలు చేసే వాళ్ళు స్వర్గానికి వెళ్లి సుఖంగా ఉంటారు.