త్రివిక్రమ్ సినిమాల్లో ఉన్న ఈ కామన్ పాయింట్ గమనించారా ?

Ads

దర్శకుడు త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేస్తున్నాడని తెలిసిన విషయమే. ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. త్వరలో రెండవ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా మహేష్ సినిమా కోసం మూడు భారీ సెట్లు వేస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో ఎప్పటిలాగే ఇందులో కూడా హౌస్ సెట్స్ కోసం ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.

సాధరణంగా త్రివిక్రమ్ సినిమాలలో ఖరీదైన, విలాసవంతమైన హౌస్ సెట్‌లను ఉపయోగిస్తాడు. ఆయన సినిమాలలో వాడే ఇళ్ళు ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటాడు. వాటికోసం భారీగానే ఖర్చు పెట్టడానికి నిర్మాతలు ముందుకొస్తారు. ఇంతకు ముందు మహేష్ బాబు సినిమా అతడు, పవన్ కళ్యాణ్ సినిమాలు జల్సా, అత్తారింటికి దారేది, సమంత, నితిన్ కలిసి నటించిన అ ఆ, ఆ తరువాత అల్లు అర్జున్ తో తీసిన సినిమా అలా వైకుంఠపురంలో ఇలా త్రివిక్రమ్ తీసిన ఏ సినిమా గురించి ఆలోచించిన కూడా, ఆ కథలు ఎక్కువ శాతం ఒక ఇంటి చుట్టూనే ఉంటాయి.

Ads

అయితే త్రివిక్రమ్ మూవీస్ కోసం తయారుచేయించిన ఈ విలాసవంతమైన ఇంటి సెట్ లను సినిమా పూర్తి అయిన తరువాత, ఇతర నిర్మాతలకు, దర్శకులకు వారి షూటింగ్‌లకు కోసం ఇచ్చారు. వాటి ద్వారా వచ్చిన మొత్తం డబ్బుని త్రివిక్రమ్ తన సినిమాల హౌస్ సెట్స్ కోసం ఖర్చు పెడతారని తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ చిత్రం SSMB28 కూడా ఇలా హౌజ్ థీమ్‌తో ఉండబోతుందని తాజా సమాచారం. యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయని అంటున్నారు. మూవీలో ఎక్కువ భాగం కథ కధనాయక ఇంట్లోనే జరుగుతుంది.మరి ఈసారి హౌజ్ సెట్‌ని ఎవరు చేయబోతున్నారో చూడాలి.

  • అతడు

  • జల్సా

  • అ ఆ

  • అలా వైకుంఠపురంలో

Previous articleదేవర మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా…?
Next articleమోడీ వల్ల మాల్దీవ్స్ టూరిజంపై దెబ్బ పడడం ఏంటి..? అసలు ఏం జరిగింది…?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.