Ads
గత రెండు సంవత్సరాలుగా పలు రకాల వివాదాలతో సతమతం అవుతున్న స్టార్ హీరోయిన్ సమంత. నాగచైతన్యతో డైవర్స్ అయిన అప్పటినుంచి ప్రతి చిన్న విషయానికి సామ్ ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సామ్ కు సంబంధించిన ఒక పాత విషయం తిరిగి ఆన్లైన్లో చర్చకు వచ్చింది. గతంలో సమంత హీరో సిద్ధార్థ తో ప్రేమాయణం నడిపిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య వ్యవహారం బెడిసి కొట్టడంతో బ్రేకప్ చెప్పి నాగచైతన్యతో ప్యాచ్అప్ చేసుకుంది. పెళ్లయిన నాలుగేళ్లకు విడాకులు తీసుకొని ప్రస్తుతం ఫుల్ బిజీ షెడ్యూల్ తో బాలి ఐలాండ్స్ లో హాలిడే జరుపుకుంటుంది. విడాకులు అయిన తర్వాత మరీ సమంత హద్దులు దాటింది అనడానికి పుష్ప సినిమాలో ఆమె చేసిన ఐటమ్ సాంగ్ నిదర్శనం.
Ads
అయితే సమంత తొమ్మిది సంవత్సరాల క్రితం సిద్ధార్థ తో జబర్దస్త్ అనే ఒక సినిమాలో నటించింది. ఈ సంగతి చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఎందుకో సడన్గా నెట్లో దీని గురించి ప్రస్తుతం హాట్ డిస్కషన్ జరుగుతోంది.
వివరాల్లోకి వెళితే సిద్ధార్థ తో పీకల లోతు ప్రేమలో కూరుకుపోయిన సమంత ఆ సినిమా షూటింగ్ టైంలో శ్రీకాళహస్తికి జంటగా వెళ్లి రాహు కేతువుల పూజ చేయించుకొని వచ్చారు. అప్పట్లో వీరిద్దరి ప్రేమ పెళ్లి వరకు వెళ్తుందని అందరూ భావించారు.
అప్పట్లో జబర్దస్త్ సినిమా చుట్టూ లెక్కలేనన్ని కాంట్రవర్సీలు నెలకొన్నాయి. అలా మొదలైంది అనే సినిమాతో హిట్ కొట్టి బాగా ఫామ్ లో ఉన్న నందిని రెడ్డి డైరెక్షన్లో అప్పట్లో క్రేజీ పైర్ సిద్ధార్థ – సమంత జంటగా బెల్లంకొండ సురేష్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం జబర్దస్త్. అయితే రిలీజ్ అయిన వెంటనే ఇది బాలీవుడ్ మూవీ బ్యాండ్ బాజా బారత్ కు కాఫీ అని .. సినిమాను యాజ్ ఇట్ ఇస్ గా తెలుగులో దింపారని పలు రకాల విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై కోర్టు వరకు బాలీవుడ్ నిర్మాతలు వెళ్లడంతో జబర్దస్త్ మూవీ ని టీవీ డివిడిలో ప్రసారం చేయకూడదని తీర్పు వచ్చింది. ఆ తర్వాత విషయాన్ని సెటిల్ చేసుకున్న బెల్లంకొండ ఎలాగో ఒకలాగా సినిమాని రిలీజ్ చేయించారు కానీ అది రిలీజ్ అయిన కొంతకాలానికి సమంత,సిద్ధార్థ విడిపోయారు.