దాంపత్య జీవితం సంతోషంగా ఉండాలంటే భార్యభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలంటే..!

Ads

పెళ్లంటే నూరేళ్ల పంట అని అంటూ ఉంటారు. అయితే భార్యాభర్తల ఇద్దరిలో ఒక్కరి ఆలోచనలో తేడా ఉన్నా సరే ఆ బంధం ‘నూరేళ్ల మంట’ అవుతుంది. మరి భార్యాభర్తలు సంతోషంగా, కలిసి ఉండాలంటే ఎలా ఉండాలి? ఏం చేయాలి? ఎవరిని పెళ్లి చేసుకోవాలన్న ప్రశ్న పెళ్లి చేసుకోవాలనుకునే అందరిలోనూ వస్తూ ఉంటుంది.

అయితే పెళ్లి చేసుకున్నప్పుడే మెచ్చుర్డ్ గా ఉండే వారిని పెళ్లి చేసుకుంటే పెళ్లి తరువాత వచ్చే ఇలాంటి ఇబ్బందులు ఉండవని అనుకుంటారు. ఇక కొందరు యువతులు తమ కంటే చాలా పెద్ద వయసు వాళ్లను వివాహం చేసుకోవడానికి ఇష్టపడేవారు ఉంటారు. కొందరు అమ్మాయిలు తమకు సమానంగా వయసు ఉన్న వాళ్లనే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతారు. వాస్తవానికి దాంపత్య జీవితం సంతోషంగా ఉండాలంటే ఇద్దరి మధ్య వయసులో ఎంత ఉండాలనేది కూడా తెలుసుకోవాలి.ముఖ్యంగా ఒక పెళ్లి చేసే ముందు పెద్దలు పెళ్లి చేసుకునే అమ్మాయి అబ్బాయి మధ్య ఉండే ఏజ్ గ్యాప్ ను లెక్కలోకి తీసుకుంటారు. సాధారణంగా అయితే ఇద్దరి మధ్య రెండు సంవత్సరాలు గ్యాప్ ఉండేలా చూసుకుంటారు. అయితే మరి కొందరు కనీసం పది సంవత్సరాల గ్యాప్ ఉండకపోతే పెళ్లి చేసుకోరు.

Ads

అయితే ఈ విషయం పైన జరిగిన అధ్యయనంలో భార్యాభర్తల మధ్య 5-7 సంవత్సరాల గ్యాప్ ఉన్న జంట మధ్య వచ్చే గొడవలు, అపార్థాలు తక్కువగా ఉంటాయని తేలింది. వీరిలో ఎవరో ఒకరు మెచ్చురిటీగా ఆలోచించి, వారి మధ్య గొడవలు రాకుండా జాగ్రత్త పడి, వెంటనే సర్దుకుపోతారట. ఈ ఏజ్ గ్యాప్ ఉన్న దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకొని సంతోషంగా ఉంటారని తేలింది.ఇక పది సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉన్న జంట మధ్య అభిప్రాయ బేధాలు వచ్చి విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, వీళ్లు సర్దుకోలేరని ఈ అధ్యయనంలో తేలింది. ఇక 20 సంవత్సరాల ఏజ్ గ్యాప్ తో పెళ్లిళ్లు చేసుకోవడం వృధా, ఈ గ్యాప్ తో పెళ్లి చేసుకుంటే ఏ విషయంలోనూ వీరి సంసారం సాగదని తేలింది.

Also Read: అమ్మాయిలూ.. 25 తరవాతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా..? సైన్స్ ఏం చెబుతోందంటే..?

Previous articleవిడిపోవడానికి ముందే ఎన్నో కాంట్రవర్సీల నడుమ చికిన్న సమంత, సిద్ధార్థ జంట
Next articleభార్య భర్తను ఎలాంటి స్థితిలో అయినా అనకూడని మాటలు ఏమిటో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.