Ads
సాధారణంగా వివిధ రకాల పదార్థాలతో విగ్రహాలను తయారు చేస్తూ ఉంటారు. అయితే వాడే పదార్థాలు బట్టి వాటి ధర కూడా ఉంటుంది. ఖరీదైన మెటీరియల్స్ ని ఉపయోగించినప్పుడు ఆ విగ్రహం ఖరీదు కూడా ఎక్కువగా ఉంటుంది. పురాతన కాలం నుండి కూడా ఎన్నో విగ్రహాలని తయారు చేస్తూనే ఉన్నారు. అయితే అప్పుడప్పుడు మనకి పూర్వికుల నాటి విగ్రహాలు దొరుకుతుంటాయి.
కొన్ని విగ్రహాలను పరిశీలించి చూస్తే చాలా విలువైనవిగా మనకు తెలుస్తాయి. ఎప్పుడైనా ఏదైనా అరుదుగా విగ్రహం కనబడింది అంటే దానిని స్కాన్ చేస్తారు సైంటిస్టులు.
దీనితో విగ్రహము ఎంత విలువ ఉంటుంది అనేది తెలుస్తుంది. అలానే ఏమైనా యునీక్ గా ఉంటే కూడా శాస్త్రవేత్తలు చెబుతారు. నెదర్లాండ్స్ లో డ్రెంట్స్ అనే ఒక మ్యూజియంలో ఒక పురాతన బుద్ధుడి విగ్రహం కనపడింది. దీనిని శాస్త్రవేత్తలు స్కాన్ చేశారు. ఆ స్కానింగ్ లో ఒక విషయం బయట పడింది.
Ads
దానిని చూస్తే ఎవరైనా షాక్ అవుతారు. విగ్రహం లోపల సాధారణంగా ఏమీ ఉండదు. ఖాళీగా ఉంటుంది. కానీ ఈ విగ్రహం లో మాత్రం 1000 సంవత్సరాల నాటి శవం దొరికింది. పరిశీలించిన శాస్త్రవేత్తలు ఖంగుతిన్నారు. అది మనిషి శవంగా కూడా గుర్తించారు. అయితే ఈ శవం దాదాపు 11 వ శతాబ్దం లేదా 12వ శతాబ్దానికి చెందినదని గుర్తించారు.
పైగా ఈ శవానికి ఒక గుడ్డ చుట్టేసి ఉంది. ఆ గుడ్డ మీద చైనీస్ భాషలో అక్షరాలు ఉన్నాయి. దీనిని పరిశీలించి చూడగా.. ఈ శవం లిక్వాన్ అనే ఒక వ్యక్తిదని తెలిసింది ఇతను బౌద్ధ సన్యాసి. చైనా మెడిటేషన్ స్కూల్ కి చెందిన వాడు అని పరిశోధన ద్వారా శాస్త్రవేత్తలు కనుగొన్నారు.