స్కూల్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితి..! బిగ్‌బాస్ తెలుగు-7 “రతిక” తల్లిదండ్రుల మాటలు వింటే కన్నీళ్లు ఆగవు..!

Ads

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ అంటే ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళకముందు ఒక లెక్క వెళ్ళాక ఒక లెక్క అన్న విధంగా బాగా పాపులారిటీ తెచ్చుకొని ఫ్యాన్ బేస్ పెంచుకుంటారు. అయితే కొంతమంది మాత్రం తమ ప్రవర్తన కారణంగా పబ్లిక్ లో బాగా డీ పాపులర్ అవుతారు. ప్రస్తుతం ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన రతిక పరిస్థితి కూడా ఇదే.

bigg boss telugu 7 rathika parents comments about her journey

హౌస్ లో మనుషుల భావాలతో ఆడడమే కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించడం వల్ల రతిక ఎలిమినేట్ అయినా …ఎవ్వరూ ఆమెకు సానుభూతి చూపించడం లేదు. బిగ్ బాస్ హౌస్ లో స్నేక్ బయటకు వెళ్ళింది…పీడా పోయింది.. రతికకు కావలసిన శాస్తి జరిగింది…ఇలా సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టే వాళ్ళ సంఖ్య ఎక్కువ. అయితే ఈ నేపథ్యంలో తమ కూతురు ఎలిమినేట్ కావడంపై రతిక తల్లిదండ్రులు మీడియా ముందు మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

Ads

నిజానికి రతిక కూడా ఒక రైతు కుటుంబం నుంచే వచ్చిన అమ్మాయి. ఆమె తల్లిదండ్రులు ప్రస్తుతం ఆమె కోరిక మేరకు హైదరాబాదులోనే ఉంటున్నారు. మీడియాతో మాట్లాడిన ఆమె తల్లిదండ్రులు ఆమె అసలు పేరు ప్రియా అని.. తెలంగాణలోని తాండూర్ వారి స్వస్థలం అని తెలిపారు. అయితే ఒకప్పుడు వ్యవసాయంలో వచ్చిన ఇబ్బందుల కారణంగా తమ కూతురికి స్కూల్ ఫీజు కూడా కట్టలేక పోయానని.. ఆ తరువాత నవోదయ స్కూల్లో సీటు రావడంతో రతిక చదువుకున్నదని తెలియజేశారు.

bigg boss telugu 7 contestant rathika

పేరుకు సర్పంచిగా పనిచేసినప్పటికీ తన బిడ్డల కోసం ఏమి సంపాదించలేకపోయానని రతిక తండ్రి రాములు బాధపడ్డారు. మంచి మెరిట్ స్టూడెంట్ కావడంతో మంత్రి మల్లారెడ్డి ఆమెకు బీటెక్ లో ఫ్రీ సీట్ ఇప్పించారని… రతిక ఎంతో తెలివైన అమ్మాయి ..కానీ ఇప్పటికీ చిన్న పిల్ల మనస్తత్వం అని ఆమె తండ్రి అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు దీని పై స్పందిస్తున్నారు. అయితే ఇప్పుడు ఎంత చెప్పి మాత్రం ఏమి ప్రయోజనం…రతిక మంచి అవకాశాన్ని తన చేతులతో తానే నాశనం చేసుకుంది అని నటిజెన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

watch video :

Previous articleవిగ్రహాన్ని స్కాన్ చేసిన శాస్త్రవేత్తలు…అందులో ఉన్నది చూసి అందరు షాక్.! ఇంతకీ ఏముందంటే?
Next articleఆ కారణం వల్లే…లాస్ట్ మినిట్ లో విజయ్ దేవరకొండకు “శ్రీలీల” హ్యాండ్ ఇచ్చిందా.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.