Ads
బాలీవుడ్ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. అమీర్ ఖాన్ సెన్సేషనల్ మూవీ దంగల్ లో చిన్నారి బబిత ఫోగట్ పాత్ర పోషించిన బాల నటి సుహానీ భట్నాగర్ కన్నుమూశారు. దంగల్ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిన విషయమే.
ఈ చిత్రంలో అమీర్ ఖాన్ చిన్న కూతురుగా నటించిన సుహాని కేవలం 19 సంవత్సరాలకే ఈ ప్రపంచాన్ని వీడి వెళ్లిపోయింది. ఈమె కాలు విరగడంతో వాడిన మందులు సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వటంతో చనిపోయిందని వార్తలు వచ్చాయి.
కానీ ఆమె చావుకి కారణం అది కాదంటూ షాకింగ్ విషయాలు వెల్లడించారు. కండరాల బలహీనతకు కారణమయ్యే అరుదైన ఇన్ఫ్లమేటరీ వ్యాధి అయినా డెర్మాటోమయోసిటీస్ వ్యాధితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు ఈ వ్యాధి కారణంగానే ఆమె ఫిబ్రవరి 16న తుది శ్వాస విడిచిందని చెప్పారు. ఆమె తల్లిదండ్రులు ఈ వ్యాధి ఉందని ఆమెకు పది రోజుల క్రితమే నిర్ధారణ అయిందని వాపోయారు.
Ads
రెండు నెలల క్రితమే వ్యాధి లక్షణాలు కనిపించడంతో హాస్పిటల్ కి తీసుకు వెళ్ళాము కానీ అది ఏ వ్యాధి అనేది నిర్ధారణ చేయలేకపోయారు. కానీ రోజు రోజుకి సుహానీ ఆరోగ్యం క్షీణించడంతో ఆమెని ఎయిమ్స్ లో చేర్పించాము. వ్యాధి తగ్గలేదు సరి కదా ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువయ్యి అదనపు ద్రవాలు ఊపిరితిత్తుల్లో చేరడంతో అవి కూడా దెబ్బతిన్నాయని సుహానీ తండ్రి సుమిత్ భట్నాగర్ చెప్పారు. ఈ వ్యాధి ప్రపంచంలో ఐదు నుంచి ఆరుగురికి మాత్రమే ఉందని చెప్పారు సుమిత్.
అసలు డెర్మాటోమియోసిటీస్ అనేది బంధన కణజాలం. కండరాలు, చర్మం, అంతర్గత అవయవాల వాపుతో కూడిన పాథాలజీ. సకాలంలో చికిత్స తీసుకోకపోతే రోజు రోజుకి వ్యాధి తీవ్రమౌతుంది. ఈ వ్యాధి యొక్క లక్షణాలు అలసట, జ్వరం, బరువు తగ్గటం, కండరాల నొప్పి, భుజం కటి ప్రాంతంలో బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి ఎదురవుతాయి. ఫిజియోథెరపీ వంటి వాటితో వ్యాధిని అదుపులో ఉంచవచ్చు కానీ పూర్తిగా నయం చేయలేం.