అసలు ఆర్టికల్ 370 ని ఎందుకు రద్దు చేసారు..? ఈ సినిమా మీద ఇన్ని నెగటివ్ కామెంట్స్ ఎందుకు వస్తున్నాయి..?

Ads

బాలీవుడ్ నటి యామీ గౌతమ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ఆర్టికల్ 370. ఇంకా కొన్ని రోజుల్లో ఈ సినిమా విడుదల అవుతుంది. సినిమా బృందం ఇప్పటికే ప్రమోషన్స్ పనిలో ఉన్నారు.

ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహించిన ఈ సినిమాని జ్యోతి దేశ్‌పాండే, ఆదిత్య ధర్, లోకేష్ ధర్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా మీద కామెంట్స్ గట్టిగానే వస్తున్నాయి. ఒక ఎజెండాతో ఈ సినిమా తీశారు అని అంటున్నారు.

what is article 370 and why comments on movie

అసలు ఆర్టికల్ 370 అంటే ఏంటి? దీన్ని ఎందుకు రద్దు చేశారు? ఇప్పుడు ఈ సినిమా మీద ఇన్ని నెగిటివ్ కామెంట్స్ ఎందుకు వస్తున్నాయి? ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలకి యాజమాన్యాన్ని కల్పిస్తూ అప్పటి భారత ప్రభుత్వం ఒక ఆర్టికల్ ఏర్పాటు చేసింది. దాని పేరు ఆర్టికల్ 370. రాజ్యాంగం ప్రకారం వేరే రాష్ట్రాలకు ఉన్న నిబంధనలు జమ్మూ కాశ్మీర్ కి వర్తించవు. ఈ ఆర్టికల్ లో ఇదే ఉంటుంది.

what is article 370 and why comments on movie

1965 వరకు జమ్మూ కాశ్మీర్ కి ముఖ్యమంత్రి బదులు ప్రధాని ఉండేవారు. గవర్నర్ బదులు ప్రెసిడెంట్ ఉండేవారు. దీన్ని అంతకుముందు జమ్మూ కాశ్మీర్ రాజు అయిన మహారాజ హరి సింగ్ దగ్గర పనిచేసిన గోపాలస్వామి అయ్యంగార్ రూపొందించారు. అయితే, ఈ ఆర్టికల్ నిబంధనల పట్ల బిఆర్ అంబేద్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఆర్టికల్ ప్రకారం రక్షణ వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు, సమాచార శాఖ వ్యవహారాలు, విదేశీ వ్యవహారాలు తప్ప, మిగిలిన ఏ చట్టాలు అయినా అమలు చేయాలి అంటే ఆ రాష్ట్రం యొక్క ఆమోదం తీసుకోవడం తప్పనిసరి అని నిబంధన పెట్టారు.

what is article 370 and why comments on movie

అంతే కాకుండా, బయట రాష్ట్రానికి చెందిన వాళ్లు జమ్ము కాశ్మీర్ లో భూమి కొనుగోలు, లేదా ఆస్తి కొనుగోలు కూడా చేయకూడదు. జమ్మూ కాశ్మీర్ కోసం ప్రత్యేకమైన రాజ్యాంగం, పీనల్ కోడ్ ఉన్నాయి. అసెంబ్లీ కాల పరిమితి ఆరేళ్లు ఉంటుంది. యుద్ధం లేదా విదేశీ దురాక్రమణ వంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే కేంద్రం ఎమర్జెన్సీ విధించాలి. ఒకవేళ అంతర్గత ఘర్షణలు ఉంటే, ఎమర్జెన్సీ విధించాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రజలకి ద్వంద్వ పౌరసత్వం కూడా ఉంటుంది. ఈ ఆర్టికల్ ప్రకారం నిబంధనలు ఇలా ఉంటాయి.

Ads

what is article 370 and why comments on movie

అయితే, ఈ ప్రక్రియ చాలా కష్టంగా ఉండడంతో, ఆగస్టు 5వ తేదీ 2019 లో రాష్ట్రపతి ఈ విషయం మీద రాజ్యాంగ సవరణ చేసి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో రాష్ట్ర సభని, రాష్ట్ర రాజ్యాంగ సభగా సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర గవర్నర్ తో సమానం అనే నిబంధనని పేర్కొంది. జమ్మూ కాశ్మీర్ అప్పుడు రాష్ట్రపతి పాలనలో ఉంది. జూన్ 2018 లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి బీజేపీ మద్దతు తెలపడం ఉపసంహరించుకున్న తర్వాత, ఆ రాష్ట్రంలో ఆరు నెలలు గవర్నర్ పాలన విధించారు. ఆ తర్వాత రాష్ట్రపతి పాలన నియమాన్ని ప్రవేశపెట్టారు.

what is article 370 and why comments on movie

మామూలుగా అయితే, ఇలాంటి సవరణ చేయాల్సి వస్తే, రాష్ట్రపతి రాష్ట్ర శాసనసభ నుండి సమ్మతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ అప్పుడు రాష్ట్రపతి పాలన ఉంది. అందుకే శాసనసభ సమ్మతి తీసుకోవడం జరగలేదు. దాంతో ఈ ఉత్తర్వుల ప్రకారం ఆర్టికల్ 370 ని సవరించే అధికారం రావడంతో, మరుసటి రోజు రాష్ట్రపతి మరో ఉత్తర్వు జారీ చేసి, అందులో భారత రాజ్యాంగంలోని అన్ని నిబంధనలు కూడా జమ్మూ కాశ్మీర్ కి వర్తిస్తాయి అని పేర్కొని ప్రత్యేక హోదాని తొలగించారు.

what is article 370 and why comments on movie

ఆగస్టు 9వ తేదీన రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్, లడక్ గా రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించే చట్టానికి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అయితే లడక్ లో శాసనసభ లేదు. జమ్మూ కాశ్మీర్ లో శాసనసభ ఉంది. ఆ తర్వాత నుండి జమ్మూ కాశ్మీర్ లో లాక్ డౌన్ విధించి, కర్ఫ్యూ అమలు చేశారు. ఇంటర్నెట్ సర్వీసులు, టెలిఫోన్ సర్వీసులు కూడా నిలిపివేశారు. 2020 జనవరిలో 2జి ఇంటర్నెట్, 2021 ఫిబ్రవరిలో 4జి ఇంటర్నెట్ సేవలని మొదలు పెట్టారు.

what is article 370 and why comments on movie

అయితే, అప్పుడు ఆర్టికల్ 370 రద్దుపై ప్రశ్ ఇస్తూ ఎన్నో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఇప్పుడు ఈ విషయం మీద బాలీవుడ్ వాళ్ళు సినిమా తీస్తున్నారు. అందుకే ఇలాంటి ఒక సెన్సిటివ్ టాపిక్ మీద సినిమా తీయడంతో కామెంట్స్ వస్తున్నాయి. కానీ సినిమా బృందం మాత్రం, “సినిమా చూశాక మీరు ఈ విషయం మీద మాట్లాడండి” అని రిక్వెస్ట్ చేస్తున్నారు.

ALSO READ : శ్రీదేవితో బాలకృష్ణ ఎందుకు నటించలేదు..? కారణం ఇదే..!

Previous articleసందడిగా టిఎస్ఎఫ్ఏ – 2023 (తెలుగు షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్) 2023.
Next article19 ఏళ్లకే దంగల్ నటి మరణించడానికి కారణం ఇదేనా..? 2 నెలల క్రితమే ఇలా జరగడంతో..?