Ads
అతడు సినిమాలో బ్రహ్మానందం కొడుకు పాత్రలో నటించారు దీపక్ సరోజ్. ఇప్పుడు దీపక్ సరోజ్ హీరోగా సిద్ధార్థ్ రాయ్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం: సిద్ధార్థ్ రాయ్
- నటీనటులు: దీపక్ సరోజ్, తన్వి నేగి, నందిని ఎల్లారెడ్డి.
- దర్శకుడు: వి. యశస్వి
- సంగీతం: రధన్
- నిర్మాత : జయ ఆడపాక
- రిలీజ్ డేట్ : ఫిబ్రవరి 23, 2024
కథ:
సిద్ధార్థ్ రాయ్ (దీపక్ సరోజ్) చిన్నప్పటినుండి ఎన్నో పుస్తకాలు చదివేసి ఎమోషన్స్ లేకుండా కేవలం లాజిక్స్ తోనే బతుకుతూ ఉంటాడు. అసలు ఎమోషన్స్ అనేవి లేవు అని, కేవలం అన్ని అవసరాలు మాత్రమే అనుకుని లాజిక్ ప్రకారం వెళ్తూ ఉంటాడు. అలాంటి సిద్ధార్థ్ ని ఇందు (తన్వి నేగి) అనే ఒక అమ్మాయి ఒక కాంపిటీషన్ లో ఓడిస్తుంది. అంతే కాకుండా ఎమోషన్స్ లేకుండా జీవితం అసలు గడవదు అని అంటుంది. ఎమోషన్స్ మనిషికి చాలా ముఖ్యం అని చెప్తుంది. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు.
ఇందుకి సిద్ధార్థ్ అంటే ఇష్టం ఉంటుంది. కానీ అతనిని దూరం పెడుతూ ఉంటుంది. తర్వాత సిద్ధార్థ్ ఇందు కోసం పిచ్చిగా తిరగడం మొదలు పెడతాడు. అసలు ఇందు అలా ఎందుకు చేస్తోంది? సిద్ధార్థ్ తన ప్రేమను గెలిపించుకున్నాడా? రాధా (నందిని ఎల్లారెడ్డి) పాత్ర ఏంటి? ఇందు ఏం చేసింది? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నుండి అర్జున్ రెడ్డి సినిమాతో ఈ సినిమాకి పోలికలు వస్తూనే ఉన్నాయి. కానీ సినిమా బృందం మాత్రం అలాంటిదేమీ లేదు అని చెప్పారు. సినిమా కథ డిఫరెంట్ గా ఉన్నా కూడా, సీన్స్ చూపించిన విధానం మాత్రం చాలా వరకు అర్జున్ రెడ్డి, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలని గుర్తుకు తెచ్చే లాగా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా మంది హీరోని పొగడడంతోనే అయిపోతుంది. సెకండ్ హాఫ్ లో హీరో ఎమోషన్స్ ఎక్కువగా అయితే ఏం చేస్తాడు అనేది చూపించారు.
Ads
కానీ అవన్నీ కూడా చాలా ఎక్కువగా అనిపించాయి. హీరో అలాంటి పనులు చేస్తాడు అని చూపించడం బాగానే ఉంది. కానీ బ్యాలెన్స్ ఎక్కడో తప్పినట్టు అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, మొదటి సినిమా అయినా కూడా దీపక్ సరోజ్ చాలా బాగా నటించారు. హీరోయిన్ తన్వి చాలా ధైర్యంగా నటించారు. నందిని కూడా తన పాత్రకి తగ్గట్టు నటించారు. మిగిలిన వాళ్ళు అందరూ కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. అయితే సినిమా చూస్తున్నప్పుడు మాత్రం చాలా చోట్ల అలాంటి సీన్స్ మనకి అంతకుముందు చూసినట్టు అనిపిస్తాయి.
లాజిక్ వర్సెస్ ఎమోషన్స్ అనే ఒక కాన్సెప్ట్ మీద ఈ సినిమా తీశారు. కొన్ని సీన్స్ బాగా రాసుకున్నారు. కొన్ని సీన్స్ మాత్రం మరీ ఎక్స్ట్రీమ్ గా అయిపోయినట్టు అనిపిస్తాయి. మధ్య మధ్యలో కొన్ని సీన్స్ ఇటీవల వచ్చిన యానిమల్ సినిమాని కూడా గుర్తుకు తీసుకొస్తాయి. కాస్త తెలివిగా ఆలోచిస్తే సినిమా అర్థం అవుతుంది. కానీ మామూలుగా వెళ్లి సినిమా చూస్తూ ఉంటే మాత్రం అర్థం అవ్వడం కొంచెం కష్టం. ఈ బ్యాలెన్స్ విషయంలో మాత్రం సినిమాలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్:
- నిర్మాణ విలువలు
- లాజిక్ వర్సెస్ ఎమోషన్ అనే పాయింట్
మైనస్ పాయింట్స్:
- అర్థం కాని కొన్ని సీన్స్
- కొన్ని సినిమాలని గుర్తుకు తీసుకువచ్చే స్క్రీన్ ప్లే
- అతిగా అనిపించే ఎమోషన్స్
- సినిమా నిడివి
రేటింగ్:
2.75/5
ఫైనల్ గా:
పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, అసలు లాజిక్ వర్సెస్ ఎమోషన్ అనే పాయింట్ ని తెర మీద ఎలా చూపించారు అని తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం సిద్ధార్థ్ రాయ్ సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : వెనక్కి తిరిగి నిల్చున్న ఈ తెలుగు హీరో ఎవరో గుర్తు పట్టారా..? రజనీకాంత్ అనుకుంటే పొరపాటే..!