వెనక్కి తిరిగి నిల్చున్న ఈ తెలుగు హీరో ఎవరో గుర్తు పట్టారా..? రజనీకాంత్ అనుకుంటే పొరపాటే..!

Ads

హీరోలకి కొన్ని కోట్ల మంది అభిమానులు ఉంటారు. ముఖ్యంగా సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అయితే హీరోలని ఎంతో అభిమానిస్తారు. వారి సినిమాలు వస్తే, వారి కటౌట్ లకి పాలాభిషేకం చేయడం వంటివి చేస్తారు.

హీరోలకి అంత మంది అభిమానులు ఉన్నారు కాబట్టి మన హీరోలు కూడా పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా మాస్క్ వేసుకొని వెళ్తూ ఉంటారు. అయినా కూడా చాలా మంది అభిమానులు వారి హీరోలని గుర్తుపడతారు.

guess the hero by picture

వెనక్కి తిరిగి ఉన్న ఫోటోలు చూసి కూడా గుర్తుపట్టే వాళ్ళు ఉంటారు. ఈ ఫోటోలో వెనక్కి తిరిగి ఉన్న హీరో ఎవరో మీరు గుర్తుపట్టగలరా? ఇతను చాలా పెద్ద హీరో. చాలా సినిమాలు చేశారు. చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన నటన కూడా చాలా సహజంగా ఉంటుంది అంటారు. ఆయన ఎవరో మీలో కొంత మందికి అయినా తెలిసి ఉంటుంది. సడన్ గా చూసి రజనీకాంత్ అనుకుంటున్నారు ఏమో. కాదు. ఇతను ఒక యంగ్ హీరో.

అది కూడా మన తెలుగు హీరో. ఆయనే. ఇటీవల హాయ్ నాన్న సినిమాతో హిట్ కొట్టిన నాని. ఇప్పుడు సరిపోదా శనివారం అనే సినిమాలో నాని నటిస్తున్నారు. ఆ సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ విడుదల చేశారు. ఆ పోస్టర్ ఇదే. అయితే పోస్టర్ చూసిన చాలా మంది కూడా నానిని చూస్తూ ఉంటే రజినీకాంత్ గుర్తొస్తున్నారు అంటున్నారు. నిన్న మరొక పోస్టర్ విడుదల చేశారు. అందులో నాని నడుస్తున్నట్టు ఉన్నారులే కానీ క్లియర్ గా కనిపించట్లేదు.

Ads

guess the hero by picture

అది చూసి కూడా నాని రజినీకాంత్ లాగా ఉన్నారు అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫోటో చూసి కూడా అలాగే కామెంట్స్ చేస్తున్నారు. ఇంక ఈ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా టీజర్ ఈ శనివారం విడుదల అవుతుంది. అందుకే సినిమా బృందం ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఇందులో ఒక సూపర్ హీరో పాత్రలో నాని నటిస్తారు.

guess the hero by picture

ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో అంతకుముందు అంటే సుందరానికి సినిమా వచ్చింది. సినిమా కలెక్షన్స్ పరంగా ఆశించిన స్థాయిలో లేకపోయినా కూడా, కంటెంట్ పరంగా మాత్రం బాగుంది అని టాక్ వచ్చింది. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో మరొక సినిమా వస్తోంది. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అంతకు ముందు నాని గ్యాంగ్ లీడర్ లో కూడా వీళ్ళిద్దరూ కలిసి నటించారు. ఎస్ జె సూర్య ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

Previous articleజయలలిత, శోభన్ బాబు ప్రేమించుకున్నారా..? శోభన్ బాబు డైరీలో ఏం రాశారు..?
Next articleఈ వ్యక్తి తెలియని తెలుగు వారు ఉండరు ఏమో..? ఇంత స్టైలిష్ గా అయిపోయారేంటి..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.