Ads
నూతన సంవత్సరం రోజున ఢిల్లీలో స్కూటీపై వెళ్తున్న ఒక యువతిని కారుతో ఢీకొట్టి 12 కి.మీ.దూరం ఈడ్చుకెళ్లి చంపిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
అయితే ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమ్మాయి పేరు అంజలి. 20 ఏళ్ల యువతి అంజలి సింగ్‌ను తలచుకుంటూ ఆమె ఫ్యామిలీ మెంబర్స్ భావోద్వేగానికి గురయ్యారు. అంజలి సింగ్ కి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడం అంటే ఎంతో ఇష్టమని, ఆమె ఎప్పుడూ నవ్వుతూ, తనతో ఉన్నవారిని నవ్విస్తూ ఉండేదని, ఆమెకు చిన్న పిల్లలతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టమని తెలిపారు. ప్రస్తుతం అంజలి సింగ్ ఇన్‌స్టాగ్రామ్ డీయాక్టివేట్ అయ్యి ఉందని, అందులో ఆమె డ్యాన్సు చేస్తున్న వీడియోలు ఉన్నాయి. ఇక అంజలి వ్యక్తిగత విషయానికి వస్తే, ఆమె ఒక్కరే వారి కుటుంబానికి ఆధారం. అంజలి తను సంపాదించిన దానితో ఫ్యామిలిని నడిపేవారు. ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇస్తున్న ఉచిత ఆహార పథకం ద్వారా వచ్చే వాటితో పూటగడుపుకుంటున్నారు. ఆమె వారి చుట్టుపక్కల నివసించే మహిళలకు మేకప్ వేస్తూ కొంచెం డబ్బుని సంపాదించేవారు. అలాగే పెళ్లిళ్లు, ఫంక్షన్స్ లో మేకప్ వేయడమే కాకుండా చిన్న చిన్న పనులు చేస్తూ సంపాదించేవారు. అంజలి తల్లి రేఖ మాట్లాడుతూ చెప్తూ ఎలాంటి కష్టం వచ్చినా కూడా ఆశను వదులుకోలేదని అన్నారు. ఇంతకాలం అలాగే బ్రతికమని చెప్పారు.
అసలేం జరిగింది అంటే కొత్త సంవత్సరం రోజున తెల్లవారుజామున ఢిల్లీలోని కంజావాలా ప్రాంతంలో ఒక యువతిని కారుతో ఢీకొట్టి అలాగే ఈడ్చుకెళ్లి, చంపిన దారుణ ఘటన జరిగింది. అయితే ఆ యువతి చనిపోయి రోడ్డుపై నగ్న స్థితిలో కనిపించింది. తొలుత పోలీసులు రోడ్డు ప్రమాదంగా చెప్పారు. అయితే ఆ తర్వాత అనేక సందేహాలు వస్తున్నాయి. కారులో ఉన్నవారు కావాలనే ఆ అమ్మాయిని కారుతో డీకొట్టి ఈడ్చుకెళ్లారని, అలాగే గంట పాటు రోడ్డుపైన కారుని అలాగే నడిపారని అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షి తెలిపారు.
Ads
Also Read: పదమూడేళ్లకే పెళ్లి, విడాకులు అయిన అమ్మాయి ఈ రోజు ఏ స్థాయిలో ఉందో తెలుసా?