Ads
ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది నాకు అది లేదని, నాకు ఇది లేదని, వారిలా నాకు ఉంటే నేను కూడా ఏదైనా సాధించేవాన్ని అని చెప్పుకుంటూ గడుపుతూ ఉండేవారు ఎక్కువయ్యారు. కృషి, సాధించాలనే పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని కొంతమందిని చూసినపుడు తెలుస్తుంది.
Ads
లక్ష్యం సరిగ్గా ఉంటే అది సాధించడానికి ఎన్నో మార్గాలు కనిపిస్తాయి. ఇక లక్ష్యం పై గురి సరిగ్గా లేకుంటే పులదారి అయిన కూడా ముళ్లదారిలాగానే కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆమెకు తననుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఏమీ అడ్డు కాలేదు. తనకు జరిగిన ప్రతిదాన్ని దిగమింగుకొని గర్వపడే స్థాయికి ఎదిగింది. మరి ఇప్పుడు ఆ సాధకురాలైన ఆదిలక్ష్మి కథ ఏమిటో తెలుసుకుందాం రండి. ఆదిలక్ష్మికి 13 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులు పెళ్లి చేశారు. ఇక మా పనైపోయిందని చేతులు దులుపుకున్నారు తల్లిదండ్రులు.
ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడకు చెందిన ఆదిలక్ష్మికి చిన్నతనం నుండే చదువంటే చాలా ఇష్టం. చదువుకుని జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని ఆమె కల. దానికోసం ఆమె చిన్నప్పటి నుండి చదువులో రాణించేది.వారిది పెద కుటుంబం కావడంతో ఆమె తల్లిదండ్రులు 8వ తరగతి తర్వాత ఒక యువకుడితో ఆదిలక్ష్మి పెళ్లి చేసారు. ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేసి, వారి బాధ్యత తీరిపోయిందనుకున్నారు. పెళ్లి తరువాత ఆదిలక్ష్మి తన చదువును కొనసాగించడానికి చాలా ప్రయత్నాలు చేసింది. అయితే ఎప్పటికప్పుడు ఆమె అత్తమామలు, భర్త కూడా వ్యతిరేకించేవారు. కానీ ఆదిలక్ష్మి ఇవేం పట్టించుకోకుండా తాను చదువుకోవాలని అనుకుని భర్తకు విడాకులు ఇచ్చింది.
ఆ తరువాత ఆదిలక్ష్మి పనిమనిషిగా చేరి, పనికి వెళ్తూనే ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఇంటర్మీడియట్ మంచి మార్కులతో పాస్ అయ్యింది. ఆ తరువాత కాకినాడలోనే ఐడియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజిలో బిటెక్ ను పూర్తి చేసింది. అయితే ఆదిలక్ష్మికి ఇంగ్లీష్ సరిగ్గా రాకపోవడంతో స్టార్టింగ్ ల చాలా ఇబ్బందులు పడింది. మంచి మార్కులు తెచ్చుకుంది. క్యాంపస్ సెలక్షన్ లో ఆమెకి మూడు ఆఫర్ లు వచ్చినా,అవి వద్దని ఆమె స్టాప్ సెలక్షన్ కమిషషన్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయి ఇండో-టిబెట్ పోలీస్ ఫోర్స్ కు సెలెక్ట్ అయ్యింది. ఆదిలక్ష్మి సాధించిన విజయాన్ని చూసి ఆమె తల్లిదండ్రులు గర్వపడుతున్నారు.
Also Read: ఈ 20 మంది నటీనటులపేర్లు ఏమిటో తెలుసా?