Ads
మహేంద్ర సింగ్ ధోనీ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. మహేంద్ర సింగ్ ధోని గురించి అందరికీ తెలుసు పైగా ఎంతో మంది ఫ్యాన్స్ కూడా ధోని కి ఉన్నారు. కెప్టెన్ గా ఇండియాకి తిరుగులేని విజయాలు అందించాడు ధోని. తీవ్ర ఒత్తిడిలో కూడా ఎంతో కూల్ గా ఉంటాడు ధోని. క్రికెట్ చరిత్ర లోనే మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించిన ఏకైక కెప్టెన్ మన ఎంఎస్ ధోని.
2007లో టి20 వరల్డ్ కప్, 2018 లో వన్డే వరల్డ్ కప్ ని ఇండియా కి సొంతం చేశాడు. రెండేళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ కూడా వచ్చింది. టెస్టుల్లో ఇండియాని నెంబర్ వన్ గా నిలిపాడు ధోని. ఇలా కెప్టెన్సీలో ఎన్నో విజయాలని అందించాడు ధోని. కోట్లాదిమంది ధోని ని అభిమానిస్తూ ఉంటారు. ధోని అంతర్జాతీయ క్రికెట్లో రిటైర్మెంట్ ని ప్రకటించినా కూడా తన క్రేజ్ అలానే ఉంది.
అయితే ఈ మిస్టర్ కూల్ ఏం తింటారు అనే సందేహం చాలా మందిలో ఉండే ఉంటుంది. మరి ఎంఎస్ ధోని ఏ ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటాడు..? తన డైట్ ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం… ధోని తన అల్పాహార సమయంలో కార్న్ ఫ్లెక్స్ ని కానీ సూప్ ని కానీ తీసుకుంటాడు. ఒక గ్లాసు పాలు హోల్ వీట్ బ్రెడ్ ని కూడా తీసుకుంటూ ఉంటాడు.
Ads
ధోని భోజనం సమయంలో అయితే పప్పు లేదంటే చికెన్ ని చపాతీలతో తీసుకుంటాడు. ధోని ఫైబర్ కోసం మిక్స్ వెజిటేబుల్స్ సలాడ్ ని తీసుకుంటాడు. అప్పుడప్పుడు చపాతీలు కాకుండా చపాతీలు కి బదులుగా అన్నం కూర పెరుగు తింటాడు. రాత్రిపూట చపాతీలు తీసుకుంటా ఉంటాడు. ఫ్రూట్ లేదా వెజిటేబుల్ ని కూడా తీసుకుంటూ ఉంటాడు.
స్నాక్స్ సమయంలో ఫ్రూట్ జ్యూస్ లేదంటే ప్రోటీన్ షేక్ ని తీసుకుంటాడు. మధ్యలో నూనె కానీ ఏదైనా ఫ్రూట్ ని కానీ సాండ్విచ్ ని కానీ తీసుకుంటూ ఉంటాడు. ధోని శీతల పానీయాలకు చాలా దూరంగా ఉంటాడు. అప్పుడప్పుడు ధోని కి ఫేవరెట్ అయిన బటర్ చికెన్ తీసుకుంటాడు. ఇవన్నీ ఇలా ఉంటే వర్కౌట్స్ ని అసలు మిస్ అవ్వడు. అందుకే అంత ఫిట్ గా ఉంటాడు ధోని. జిమ్ లో కార్డియో ఇతర వ్యాయామాలు చేస్తూ ఉంటాడు. ఫుట్బాల్, బ్యాడ్మింటన్ ని కూడా ఆడుతూ ఉంటాడు ధోని.