ఎవర్ని అడిగినా ఈ సినిమా గురించే చెప్తున్నారు… ఈ OTT సెన్సేషన్ సినిమాలో అంతగా ఏముంది.?

Ads

యువతను ఎక్కువగా ఆకట్టుకునేది ప్రేమకథలే అనే విషయం తెలిసిందే. అందువల్లే ఏ సమయంలో రిలీజ్ అయినా ప్రేమకథలతో తెరకెక్కిన చిత్రాలు విజయం సాధిస్తుంటాయి. ఎంచుకున్న లవ్ స్టోరీలో ఫీల్ ఉంటే భాషతో, ప్రాంతం అనే తేడా లేకుండా ఆడియెన్స్ ఆదరిస్తుంటారు.

అలాంటి లవ్ స్టోరీతో తెరకెక్కిన తమిళ చిత్రం ‘జో’ తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. గత ఏడాదిరిలీజ్ అయ్యి. మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ‘హాట్ స్టార్’లో తెలుగు వెర్షన్ లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.  మరి ఈ సినిమా స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

రియో ​​రాజ్, మాళవిక మనోజ్, భవ్య త్రిఖ ప్రధాన పాత్రలలో నటించిన తమిళ సినిమా జో. ఈ చిత్రానికి హరిహరన్ రామ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాని విజన్ సినిమా హౌస్ బ్యానర్‌ పై నిర్మించారు. సిద్ధు కుమార్‌ ఈ మూవీకి సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమా 2023 లో నవంబర్ 24న థియేటర్లలో రిలీజ్ అయ్యి, ప్రేక్షకుల ఆదరణ పొందింది. జనవరి 15 నుండి ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Ads

ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, బాగా డబ్బున్న కుటుంబానికి ఏకైక వారసుడు జో (రియో రాజ్), చిన్నతనం నుండి జోకి ఐదుగురు మిత్రులు ఉంటారు. ఎక్కడికి అయినా ఆ ఫ్రెండ్స్ తో వెళ్తుంటాడు. జోకాలేజీలో, తన క్లాస్‌మేట్ గా కొత్తగా సుచి (మాళవిక మనోజ్) జాయిన్ అవుతుంది. కేరళకు చెందిన సుచి సెన్సిటివ్, మృదుస్వభావి కావడంతో ఆమెను ఇష్టపడతాడు. ఆమెను వేధిస్తున్న సీనియర్ నుండి సేవ్ చేస్తాడు. ఆ క్రమంలో ఇద్దరి ఆమధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమకు దారి తీస్తుంది. కాలేజీ చదువు పూర్తి చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు.

అయితే సుచి తల్లిదండ్రులు ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని నిర్ణయిస్తారు. విషయం తెలిసిన సుచి ‘జో’ కి ఫోన్ చేసి పెళ్లి విషయం చెప్పి, తన తల్లిదండ్రులతో తమ పెళ్లి గురించి మాట్లాడమని చెబుతుంది. దాంతో ‘జో’ సుచి ఇంటికి వెళతాడు. వారి ప్రేమ గురించి తల్లిదండ్రులతో ప్రేమ, పెళ్లి గురించి ప్రయత్నిస్తాడు. కానీ వారి బంధువులు ‘జో’ ను కొడతారు. అది గోడవగా మారుతుంది. ఆ క్రమంలో సుచి తండ్రి క్రింద పడిపోతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సుచి జో పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక జో చెప్పేది వినకుండా తనను ఇక మీదట కలవవద్దని చెప్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? వారిద్దరి పెళ్లికి పెద్దలు అంగీకరించారా? చివరికి ఏం జరిగింది అనేది మిగిలిన కథ.

Previous articleగుర్తుపట్టలేనట్టుగా మారిపోయిన ఈ నటుడు ఎవరో తెలుసా? మూడు నెలల పాటు విదేశాల్లో.?
Next articleకెప్టెన్ కూల్ ధోని డైట్ ఏమిటి..? అసలు ఏం తింటారో తెలుసా..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.