ఈ పోస్టర్‌లో ఉన్న సీనియర్ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..? 37 ఏళ్ళ తర్వాత..?

Ads

ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభిస్తూ రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించి స్టార్ నటీనటులుగా కొనసాగిన ఎంతోమంది ఇప్పుడు సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్నారు. అటువంటి వారిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే సీనియర్ హీరోయిన్ కూడా ఒకరు.

ప్రస్తుతం ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాకుండా ఆమె నటిస్తున్న ఒక సినిమా పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రతి ఒక్కరూ ఆ ఫోటోలో ఉన్న ఆ సీనియర్ హీరోయిన్ ఎవరు అని వెతకడం మొదలుపెట్టారు.

did you know this heroine

దీంతో ఆమె ఎవరు అన్న విషయాలు విలుగులోకి వచ్చాయి. ఇంతకీ ఆ సీనియర్ హీరోయిన్ ఎవరు అన్న వివరాల్లోకి వెళితే.. మా AAI ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా షష్టిపూర్తి. ఈ సినిమాలో నటుడు రాజేంద్రప్రసాద్ సీనియర్ హీరోయిన్ అర్చన ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అప్పుడెప్పుడో 37 ఏళ్ల కిందట వచ్చిన లేడీస్ టైలర్ సినిమా తర్వాత రాజేంద్రప్రసాద్ అర్చన ఇద్దరు కలిసి నటించిన సినిమా ఇదే.

Ads

did you know this heroine

అంటే దాదాపుగా 37 ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి నటించారు. ఇందులో ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాను పవన్ ప్రభా దర్శకత్వంలో రూపేష్ చౌదరి నిర్మిస్తున్నారు. అలాగే కథానాయకుడిగా కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ 80 శాతం పూర్తి అయినట్లుగా మూవీ మేకర్స్ తెలిపారు.

did you know this heroine

తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. అందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందులో సీనియర్ హీరోయిన్ అర్చన ను ఇంత గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది అని ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ALSO READ : కార్తీక దీపం సీరియల్ “హిమ” గుర్తుందా..? ఇప్పుడు ఎలా మారిపోయిందో చూశారా..?

Previous articleతిరుమలలో చోటుచేసుకున్న ఘటన..! అదృష్టం అంటే ఆ భక్తురాలిదే..!
Next articleస్టార్ హీరోలతో సినిమాలు… అయినా గుర్తింపు రావట్లేదు..! ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.