Ads
డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న సక్సెస్ ఫుల్ కమర్షియల్ డైరెక్టర్. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత ఇప్పటివరకు అపజయం ఎరగని డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. కామెడీ సినిమాలకి మాస్ కమర్షియల్ సినిమాలకి అనిల్ రావిపూడి పర్ఫెక్ట్ మాస్టర్. అనిల్ రావిపూడి ప్రతి సినిమా కూడా ప్రొడ్యూసర్లకి కాసుల వర్షం కురిపిస్తుంది. అందుకే అనిల్ రావిపూడి తో సినిమాలు తీసేందుకు ప్రొడ్యూసర్లు ముందుగానే అడ్వాన్సులు ఇచ్చి రెడీగా ఉంటున్నారు.
హీరోలు కూడా అనిల్ రావిపూడి అడిగిన వెంటనే డేట్లు ఇవ్వడానికి ఏమాత్రం ఆలోచించడం లేదు. జంధ్యాల, ఈవీవీలు ఇన్స్పిరేషన్ అంటూ వారిని ఆదర్శంగా తీసుకుని కామెడీ సినిమాలు కమర్షియల్ సినిమాలు తీస్తున్నారు.
ఒక్కసారి ఆయన తీసిన సినిమాల లిస్ట్ తీసుకుంటే…. నందమూరి కళ్యాణ్ రామ్ తో మొదటి సినిమా పటాస్ తీశారు. అది ఏటువంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి భారీ హిట్ అయింది. కళ్యాణ్ రామ్ కెరీర్ లోని సూపర్ హిట్ గా నిలిచింది. తర్వాత సాయి ధరంతేజ్ తో సుప్రీమ్ ,రవితేజ తో రాజా ది గ్రేట్, వెంకటేష్-వరుణ్ తేజ్ లతో తీసిన ఎఫ్ 2, సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు, ఎఫ్2కి సీక్వెల్ గా వచ్చిన ఎఫ్3, తాజాగా నందమూరి బాలకృష్ణ తో తీసిన భగవంత్ కేసరి ఇది ఆయన ట్రాక్ రికార్డు.అనిల్ రావిపూడి రైటర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసి పలు సినిమాలకి పని చేశారు.
Ads
డైరెక్టర్ గా రైటర్ గానే తెలిసిన అనిల్ రావిపూడి యాక్టర్ గా ఎవరికీ తెలియదు. ఆయన రైటర్ గా పనిచేసిన ఒక సినిమాలో అనిల్ రావిపూడి నటించిన విషయం చాలామందికి తెలియకపోవచ్చు. గోపీచంద్ హీరోగా తమిళ్ డైరెక్టర్ శివ డైరెక్షన్ లో వచ్చిన శౌర్యం సినిమాకి అనిల్ రావుపూడి రైటర్ గా పనిచేశారు. ఆ సినిమాలో హాస్పటల్ లో ఒక సీన్ లో ఒక చిన్న రోల్ లో అనిల్ రావిపూడి మెరిసారు.
ఇప్పుడు ఈ వీడియో ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతుంది.నటనన్ డైరెక్షన్, రైటింగ్ ఏ కాకుండా అనిల్ రావిపూడి కి డాన్స్ అన్న కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడు తన సినిమాల్లో, అలాగే స్టేజిల మీద కాలు కదుపుతూ ఉంటారు. ఏది ఏమైనా ఒక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లో ఇన్ని టాలెంట్ లు ఉండడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయమే.
ALSO READ : రిలీజ్ అయ్యి నెల కాలేదు… మళ్ళీ రీ-రిలీజ్ ఏంటో.? కారణం ఇదేనా.? మరి OTT లో ఎప్పుడు.?