బండి కొంటున్నారా.? ఎక్స్‌షోరూం (EX-SHOWROOM) ధరకి – ఆన్‌రోడ్‌ (ON ROAD) ధర కి తేడా ఏంటో తెలుసా.?

Ads

బైక్‌ లేదా కారు ప్రకటనలు చూసినపుడు వాటి ధర తక్కువ ఉండడంతో కొనాలనుకున్నవారు సంతోషంగా డీలరు దగ్గరికి వెళతారు. కానీ అక్కడ వారు  చెప్పే ధర విని షాక్ అవుతారు. ఎందుకంటే చాలామందికి  ఎక్స్‌ షోరూం, ఆన్‌రోడ్‌కి మధ్య ఉన్న వ్యత్యాసం తెలియదు.

ఎక్స్‌ షోరూం, ఆన్‌రోడ్‌ ధరల గురించి ఆటోమొబైల్‌ ఫీల్డ్ లో ఉన్నవారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే కొత్తవాళ్లకు వీటి గురించి అంతగా తెలియదు. ఈ రెండు ధరల మధ్య వ్యత్యాసం ఎందుకో ఇప్పుడు చూద్దాం..
డీలర్లు తయారీదారు నుండి వాహనాన్ని కొనుగోలు చేసే ధరను ఎక్స్-షోరూమ్ ధర అంటారు. అంటే వెహికిల్ తయారీకి అయ్యే ఖర్చు ఎక్స్‌ షోరూం ధర. ప్రభుత్వానికి కట్టే టాక్స్ లు, డీలరు లాభం, రిజిస్ట్రేషన్ వంటివన్నీ కలిపి వాహనానికి మొత్తం అయ్యే ధరను ఆన్‌రోడ్డు ప్రైస్ అంటారు. ఎక్స్‌ షోరూం, ఆన్‌రోడ్‌ ధరల మధ్య తేడా కనీసం 10 శాతమైనా ఉంటుంది.

రిజిస్ట్రేషన్‌ ఛార్జీ:
బైక్ లేదా కారు కొనుగోలు చేసినా, అది ప్రాంతీయ రవాణా కార్యాలయంలో (RTO) రిజిస్ట్రేషన్‌ చేయాల్సిందే. సాధారణంగా, వాహనాన్ని కొనుగోలు చేసే డీలర్ దీన్ని పూర్తి చేస్తారు. తదనుగుణంగా, డీలర్ ఈ ఖర్చును వాహనం యొక్క తుది ధరలో చేర్చుతారు. అది ఆన్-రోడ్ ధర. అలాగే, నిర్దిష్ట రిజిస్ట్రేషన్ నంబర్ కావాలంటే వాహన రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయి.
నిర్వహణ ప్యాకేజీ: 
చాలా మంది వాహన డీలర్లు వాహనాన్ని శుభ్రపరచడం, పాలిషింగ్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వంటి సేవలను కలిగి ఉండే వార్షిక నిర్వహణ ప్యాకేజీని అందిస్తారు. అందులో ఎక్కువగా అవసరం లేనివే ఉంటాయి. ఈ ప్యాకేజీని తీసుకుంటే, ఆన్-రోడ్ ధర మరింత పెరుగుతుంది.

Ads

జీవితకాల రోడ్డు పన్ను:
వాహనాన్ని రోడ్డు పైన నడపడానికి తప్పనిసరిగా రోడ్డు పన్ను చెల్లించాలి. ఇది ఆన్-రోడ్ ధరలో ఒక భాగం అయితే, ఎక్స్-షోరూమ్ ధర ఆధారంగా లెక్కించబడుతుంది. రోడ్డు పన్ను 3 శాతం ఉంటుంది. ఒకసారి చెల్లించిన రోడ్డు పన్ను 10-15 సంవత్సరాల వరకు వర్తిస్తుంది.

బీమా:

వెహికిల్ ప్రమాదాల్లో, వాహనం దొంగతనం జరిగినపుడు బీమా ఆదుకుంటుంది. వాహనానికి బీమా  తప్పనిసరి. మోటారు వాహన చట్టం ప్రకారం, మోటారు బీమా లేకుండా వాహనాన్ని రోడ్లపై నడపలేరు. థర్డ్‌ పార్టీ భీమా తప్పనిసరి. సాధారణంగా, డీలర్లు బీమా ప్రొవైడర్‌లతో టై-అప్‌ అయ్యి ఉంటారు. స్వంతంగా బీమాను పొందవచ్చు. అయితే, డీలర్ నుండి మీ మోటారు బీమాను పొందితే, దాని ధర వాహనం ఆన్-రోడ్ ధరలో కలుపుతారు.
అదనపు యాక్సెసరీలు: 

వెహికిల్ కొనేటప్పుడు ఫ్లోర్ మ్యాట్స్ మరియు సీట్ కవర్లు వంటి కొన్ని యాక్సెసరీలు అవసరం. వాటిని  విడిగా కొనుగోలు చేయవచ్చు. వాహన డీలర్ నుండి యాక్సెసరీలు కొనుగోలు చేస్తే దాని ధర ఆన్-రోడ్ ధరలో చేర్చబడుతుంది. నిజానికి డీలర్లు చెప్పిన విడిభాగాలన్ని తీసుకోవాల్సిన పని లేదు. షోరూంలో కన్నా బయట కొనుగోలు చేస్తే తక్కువ ధరకు లభిస్తాయి.

హ్యాండ్లింగ్‌/లాజిస్టిక్‌ ఛార్జీలు:

వెహికిల్ తయారైన తరువాత గోదాములకు, గోదాముల నుంచి షోరూంకి చేర్చడానికి, వాటిని స్టోర్ చేయడానికి అయిన ఛార్జీలు కూడా వసూలు చేస్తుంటారు. డీలర్ల లాభాలు ఎక్స్‌షోరూం ధరలో కలిసి ఉంటాయి. కాబట్టి హ్యాండ్లింగ్‌ ఛార్జీలు వసూల్ చేయడం చట్టవిరుద్ధమని, వాటిని మాఫీ చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది.

Also Read: ప్ర‌ధానికి సెక్యూరిటీ క‌ల్పించే ఎస్‌పీజీ క‌మాండోకు ఎంత సాలరీ ఇస్తారు..?, ఎలా ఎంపిక చేస్తారు..?

 

 

Previous articleఅబ్బాయిలు ఈ 7 లక్షణాలు ఉన్న అమ్మాయిలనే ఇష్టపడతారు అంట..? ఏంటో చూడండి.!
Next articleసిక్స్ ప్యాక్ ఫోటోతో షాకిచ్చిన హీరోయిన్.. ఈ తెలుగు హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.