Ads
ప్రపంచంలో అందాలకు సంబంధించిన పోటీలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. అయితే వాటిల్లో ఎక్కువ ప్రసిద్ధి చెందినది మిస్ వరల్డ్ మరియు మిస్ యూనివర్స్ పోటీలు. వీటిలో గెలవడం కోసం ఎందరో తిండి తిప్పలు మాని తెగ కష్టపడుతుంటారు. అయితే ఈ రెండు పోటీల మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది అన్న విషయం చాలా మందికి తెలియదు.
మిస్ వరల్డ్ మరియు మిస్ యూనివర్స్ పోటీలు నిర్వహించే ఆర్గనైజేషన్స్ రెండు వేరు. మిస్ వరల్డ్ హెడ్ క్వార్టర్స్ లండన్ లో ఉండగా మిస్ యూనివర్స్ హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ లో ఉంది. మిస్ వరల్డ్ పోటీలు నిర్వహణ 1951వ సంవత్సరం నుంచి జరుగుతుండగా.. మిస్ యూనివర్స్ పోటీలు 1952 వ సంవత్సరం నుంచి మొదలయ్యాయి.
Ads
మిస్ యూనివర్స్ సెలక్షన్స్ ఎక్కువగా అందం మీదే ఆధారపడి ఉంటాయి. అయితే మిస్ వరల్డ్ సెలక్షన్స్ లో మాత్రం అందంతోపాటు తెలివితేటలని కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఫిన్లాండ్‌కు చెందిన ఆర్మీ కుసేలా 1952లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలలో విజేతగా నిలిచారు. ప్రపంచంలో మొదటి మిస్ వరల్డ్ గా స్వీడన్‌కు చెందిన కికీ హకాన్సన్ టైటిల్ను కైవసం చేసుకున్నారు.
ఇండియా నుంచి మొట్టమొదటిసారిగా మిస్ యూనివర్స్ టైటిల్ ని గెలుచుకున్న వ్యక్తి ప్రసిద్ధ బాలీవుడ్ నటి సుస్మితా సేన్. అలాగే మన దేశం నుంచి మొట్టమొదటి ప్రపంచ సుందరిగా రీటా ఫారియా 1966 లో టైటిల్ గెల్చుకుంది. ఈ రెండు అందాల పోటీలతో పాటు మిస్ ఎర్త్ ,మిస్ ఇంటర్నేషనల్ పోటీలను కూడా నిర్వహిస్తున్నారు.