రద్దు చేసిన పాత నోట్లను ఆర్బిఐ ఏం చేస్తుందో తెలుసా?

Ads

2016లో ఒక్కసారిగా నరేంద్ర మోడీ 500 మరియు 1000 నోట్ లపై డిమానిటైజేషన్ ప్రకటించడం జరిగింది. డిమానిటైజేషన్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పటివరకు చలామణిలో ఉన్నటువంటి పాత నోట్లను అధికారికంగా ఉపసంహరించుకోవడం. అంటే దీని ప్రకారం ఇక 500 మరియు 1000 రూపాయల నోట్లు చలామణిలో ఉండవు. ఎవరి దగ్గరైనా ఈ నోట్లో ఉన్నట్లయితే వారు బ్యాంకులో జమ చేసి కొత్త నోట్లను తీసుకోవచ్చు.

ఒక్కసారి రద్దు అయిన తర్వాత తిరిగి ఆ నోట్లను చలామణి లోకి తీసుకురావడం అనేది వాటి స్థానంలో కొత్త నోట్లు రిలీజ్ చేయబడతాయి.అయితే ఇలా వెనక్కి వచ్చిన నోట్లను బ్యాంకులు ఏమి చేస్తాయి అన్న ప్రశ్న అందరికీ వస్తుంది.డిమానిటైజేషన్ తర్వాత బ్యాంకులో 500 మరియు 1000 కాగితాలు పెద్ద మొత్తంలో వచ్చి చేరాయి. అయితే అవి చలామణిలో లేవు కాబట్టి వాటి వల్ల ఆర్బిఐ కి కూడా ఎటువంటి ఉపయోగం లేదు. మరి అలాంటి నోట్లను ఆర్బిఐ ఏం చేసింది ? ఎక్కడ ఎలా భద్రపరిచింది ? తెలుసుకుందాం.

Ads

ఆర్బిఐ రద్దు చేయబడిన నోట్లను ముక్కలుగా చేసి కుదించిన వ్యర్ధాలను పెద్ద బ్లాక్‌లుగా మారుస్తుంది. ఆ తర్వాత వాటిని బ్రికెట్‌లుగా మార్చి టెండర్లకు ఆహ్వానిస్తారు. ఈ బ్రికెట్లను ఉపయోగించి రీసైకిల్డ్ పేపర్ మరియు కార్డు బోర్డు తయారీ జరుగుతుంది. ఎందుకంటే పాత నోట్లు నిల్వ చేసుకుంటూ పోతే భద్రత పరంగా కష్టం మరియు వాటిని మైంటైన్ చేయడం మరింత కష్టం. కాబట్టి ఎప్పటికప్పుడు ఇలా డిమానిటైజ్ అయిన నోట్లను రీసైకిల్ చేయడం జరుగుతుంది. 

Previous articleకస్టమ్స్ అధికారులు సీజ్ చేసిన వస్తువులు ఏం చేస్తారో మీకు తెలుసా?
Next articleమిస్ వరల్డ్..మిస్ యూనివర్స్ మధ్య వ్యత్యాసం ఏమిటో మీకు తెలుసా?