ఇంట్లో ఏ దిశలో ఎలాంటి మొక్కలని పెట్టుకోవాలి..? ఏవి వుండకూడదు..?

Ads

మనం తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే. తెలిసి చేసినా తెలియక చేసిన మనం చేసే దాని వెనుక మంచి చెడు కలగడం జరుగుతూ ఉంటుంది. అందుకని తప్పకుండా మనం ఒకవేళ చేసినవి తప్పు అని మనకి తెలిస్తే వాటిని మనం సరి చేసుకోవాలి. మనం ఇంట్లో చేసే పనులు బట్టి నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ కలుగుతూ ఉంటాయి.

ప్రతి ఒక్కరికి కూడా మంచే జరగాలని ఉంటుంది. చెడుకి దూరంగా ఉండాలని.. చెడు కలగకూడదు అని.. ఆనందంగా జీవించాలని ఉంటుంది. అయితే ఇంట్లో కనుక ఈ మొక్కలు ఉంటే కచ్చితంగా జాగ్రత్తపడాలి. మరి ఎటువంటి మొక్కలను ఇంట్లో ఉంచుకోకూడదు…? ఎలాంటి ముక్కలు ఇంట్లో ఉంచుకోవచ్చు అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లో ఏ వైపు మొక్కలు ఉంటే మంచిది ఎలాంటి మొక్కలు ఇంట్లో ఉండాలి అనేది తప్పక తెలుసుకోవాలి. మన ఇంటి పక్కన ఇంటికి కొంచెం దూరం లో ఎలాంటి మొక్కలు అయినా కూడా ఉండొచ్చు. అలానే చెట్లు కూడా ఉండొచ్చు. కానీ ఇంట్లో అన్ని రకాల మొక్కలు వుండకూడదు. కొన్ని నియమాలు వున్నాయి. అసలు వృక్షాలు వంటివి ఇంట్లో వుండకూడదు.

Ads

పెద్ద పెద్ద వృక్షాల వలన ఇంటి యొక్క పునాది దెబ్బ తినొచ్చు. అందుకని ఇంటికి దూరంగా వృక్షాలని ఉంచుకోవడం మంచిది. పంచభూతాలకి సంబంధించిన రంగులు ప్రకారం మనం మొక్కలని ఇంట్లో పెట్టుకోవచ్చు. ఉత్తరం వైపు జలస్థానం. జలం అంటే నీలం రంగు కనుక నీలం రంగులో ఉండే పూల మొక్కలని మనం ఈ దిశలో వేస్తే మంచిది. తూర్పు వాయుస్థాన. గాలి. కనుక పచ్చని మొక్కలని తూర్పు వైపు ఉండేటట్టు చూసుకోవాలి.

పూలు తక్కువ ఆకులు ఎక్కువ ఉండే మొక్కలని తూర్పు వైపు వేస్తే ఎంతో మంచిది. ఆగ్నేయం వైపు ఎరుపు రంగు మొక్కల్ని వేస్తే మంచిది. ఎర్ర మందారం, ఎర్రటి గులాబీలు వంటివి ఆగ్నేయం వైపు వేసుకోవచ్చు. దానిమ్మ వేస్తే మరీ మంచిది. నైరుతివైపు పసుపు రంగు పూలు ఉండే మొక్కలను వేస్తే మంచిది. పడమర వైపు అశోక చెట్టు వేస్తే మంచిది.

తెలుపు రంగు, ఆకాశం రంగు లేదంటే మెరుస్తూ ఉండే రంగు తో పూసే పువ్వుల మొక్కలని ఈ వైపు వేసుకోవచ్చు. ఉత్తరం వైపు పారిజాతం వంటివి పెట్టుకోవచ్చు. కానీ ముళ్ళు ఎక్కువగా ఉండే మొక్కలను ఇంట్లో పెట్టుకోకూడదు తుంచితే పాలు కారే మొక్కల్ని కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. ఇటువంటివి ఇంట్లో పెట్టడం మంచిది కాదు కానీ ఇంటికి దూరంగా ఉంచొచ్చు తప్పులేదు.

Previous articleపొగాకు, గుట్కా యాడ్లలో కనపడే వీళ్ళు ఎవరు..? బాధితులేనా, నటులా..?
Next article”కొండారెడ్డి బురుజు” కి ఆ పేరు రావడం వెనుక.. ఇంత పెద్ద కథ ఉందా…?