”కొండారెడ్డి బురుజు” కి ఆ పేరు రావడం వెనుక.. ఇంత పెద్ద కథ ఉందా…?

Ads

రాయలసీమ అనగానే మనకి మొట్టమొదట ఫ్యాక్షనిజం గుర్తుకు వస్తూ ఉంటాయి ఎందుకంటే చాలా సినిమాల్లో మనకి ఫ్యాక్షనిజం చూపించారు. అయితే రాయలసీమ అంటే రత్నాల సీమ కూడా పైగా ఎన్నో అద్భుతాలకి నిలయం రాయలసీమ. ఒకప్పుడు రాయలసీమని విజయనగరం జిల్లాతో పాటుగా శ్రీకృష్ణ దేవరాయులు పరిపాలించారు. రాయలసీమ పేరు చెప్తే మనకి కొండారెడ్డి బురుజు కూడా గుర్తొస్తుంది. చాలా సినిమాల్లో కొండారెడ్డి బురుజుని చూపించారు.

మహేష్ బాబు ఒక్కడు సినిమాలో కొండారెడ్డి బురుజుని చూపించారు. అలానే సరిలేరు నీకెవ్వరూ సినిమాలో కూడా చూపించారు. ఇలా పలు సినిమాల్లో కనపడుతుంది. కొండారెడ్డి బురుజు ని సినిమాల్లో అందరం చూసాము కానీ దాని చరిత్ర గురించి దాని ప్రత్యేకత గురించి చాలా మందికి తెలీదు.

ఈరోజు ఆ విషయాలనే మనం తెలుసుకుందాం… కర్నూలులో ఉన్న కొండారెడ్డి బురుజు ఆంధ్రుల తొలి రాజధాని. ఇది కేవలం ఒక కట్టడం కాదు. ఎన్నో చరిత్ర పుటల్ని కలిగి వున్నది. క‌ర్నూలు కోట‌లో భాగం ఇది. శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌ల‌ త‌ర్వాత విజ‌య‌న‌గ‌ర సామ్రాజ్యాధీశుడైన ఆయన స‌వ‌తి త‌మ్ముడు అచ్యుత దేవ‌రాయ‌లు దీన్ని నిర్మించారు.

Ads

ఆయన పేరే దీనికి వుంది. మనం కొండారెడ్డి బురుజుగా పిలుచుకుంటున్నాం కానీ దీని అసలు పేరు అత్యుత దేవరాయ బురుజు. క్రీ.శ 1602-1618 మధ్య కాలం లో అబ్దుల్ వహబ్ కందన ఓలు ని పాలించేవాడు. ఆ టైం లో నంది కొట్కూరు పాతకోట పాలగడు అయిన కొండారెడ్డి ఈయన పాలనను ఎదిరించగా.. ఇతనిని ఓడించి ఈ బురుజులో బంధించడం జరిగింది. తరువాత కొండారెడ్డి కారాగారంలోనే చనిపోయాడు. ఇలా దీనికి కొండారెడ్డి బురుజు అనే పేరొచ్చింది.

ఇక మరి కొందరి అభిప్రాయం ప్రకారమైతే.. అలంపూర్ లో నివసించే కొండారెడ్డి అనే దేశభక్తుడు వీరి యొక్క పాలనను ఎదిరించగా.. కొండారెడ్డి ని ఈ కోటలో బందించారట. ఇలా ఇతని పేరు మీద కొండారెడ్డి బురుజు వచ్చిందని కొందరంటారు. నంది కొట్కూరు పాలగని వల్లే ఈ కోటకి కొండారెడ్డి బురుజు అని ఇంకొందరు అంటారు.

 

Previous articleఇంట్లో ఏ దిశలో ఎలాంటి మొక్కలని పెట్టుకోవాలి..? ఏవి వుండకూడదు..?
Next articleహీరోయిన్ల ని పెళ్లి చేసుకున్న 9 మంది క్రికెటర్స్ వీళ్ళే..!