Ads
ఒకప్పుడు ఆడవారు అంటే ఎంత నిండుగా చీర కట్టుకుంటే అంత అందంగా ఉంటారు అని అభిప్రాయం ఉండేది. పొద్దునైనా రాత్రయినా ఎప్పుడు వారు ఎంతో నిండుగా చీరలో కనిపించేవారు.
కానీ కథ కొద్దిగా ఆడవారికి నైటీలు వేసుకోవడం బాగా అలవాటైపోయింది. అయితే ఇది కేవలం రాత్రిపూట కాదు పొద్దున్నుంచి సాయంత్రం దాకా యూనివర్సిటీ డ్రెస్ కోడ్ కింద నైటీ మారిపోయింది.
ఇంట్లో ఉన్నప్పుడే కాదు గబక్కను బయటకు వెళ్లాల్సి వచ్చిన ఆ నైటీపై ఏదో ఒక చున్ని టవల్ వేసుకుని వెళ్లడం ఇప్పుడు చాలామందికి కంఫర్టబుల్గా ఉంది. కానీ నైట్ ఏమి ఇలా పొద్దున పూట కూడా వేసుకుని తిరగడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవి ఏమిటో చూద్దాం..
Ads
రాత్రిపూట మనం పడుకున్న తర్వాత మన ఒంటి మీద ఎన్నో క్రిములు చేరుతాయి.. పొద్దున లేచిన తర్వాత పళ్ళు తోముకోవడం, కాల కృత్యాలు లాంటి కార్యక్రమాల వల్ల ఆ నైటీపై ఇంకా ఎక్కువ క్రిములు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మనం అదే నైటీతో వంట గదిలోకి వెళ్లి చుట్టూ ఉన్న పదార్థాలను తాకడమే కాకుండా వంట చేసి పెడితే తినేవారికి వ్యాధులు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందుకే పూర్వం రోజుల్లో స్నానం చేశాకే వంటగదిలోకి వెళ్లాలి అని పెద్దలు చెప్పేవారు.
అది కాక నైటీ అన్న పదంలోనే నైట్ అన్న అర్థం స్పష్టంగా ఉంది. కాబట్టి ఇది కేవలం రాత్రిపూట మాత్రమే వేసుకునే ఒక వస్త్రం అని అర్ధం. కాబట్టి దీన్ని కేవలం రాత్రిపూట వరకే వేసుకోవడానికి పరిమితం చేయాలి . ఇది కేవలం శుభ్రత దృశ్యా.. ఒక ఆరోగ్యకరమైన అడ్వైజ్ గా ఇవ్వడమే తప్ప.. ఇందులో మరింకేటువంటి భావం లేదు.