చాలా టాలెంట్ ఉంది…కానీ ఈ నటుడిని మన ఇండస్ట్రీ వాళ్ళు సరిగ్గా వాడుకోలేకపోతున్నారు అనుకుంట.?

Ads

మామూలుగా సినిమా ఇండస్ట్రీకి కొత్త కొత్త నటీనటులు ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. కొందరు అలాగే నిలదొక్కుకుంటే మరి కొంతమంది సరైన అవకాశాలు లేకపోవడంతో సినిమాలకు దూరం అవుతూ ఉంటారు. అలా ఎంతో మంది సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వెళ్తుండగా అందులో కేవలం కొంతమందిని మాత్రమే ప్రేక్షకులు , ఇండస్ట్రీ గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది. అటువంటి వారిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే నటుడు కూడా ఒకరు. అతను మరెవరో కాదు నటుడు లక్ష్మణ్. అయితే ప్రేక్షకులు ఈ పేరు చెబితే గుర్తుపట్టకపోవచ్చు కానీ తాజాగా మంగళవారం సినిమాలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు నటుడు లక్ష్మణ్.

సినిమాలో నటుడు లక్ష్మణ్ యాక్టింగ్ చూస్తే అతనికి మంచి టాలెంట్ ఉంది. కానీ అది మన తెలుగు సినిమా దర్శకులు గుర్తించలేకపోయారు అని అనిపించక మానదు. అంతలా తన యాక్టింగ్ తో ప్రేక్షకులను మెప్పించాడు లక్ష్మణ్. మంగళవారం సినిమా చూసిన తర్వాత లక్ష్మణ్ ని చాలామంది గుర్తుపడతారు ఎందుకంటే సినిమా పూర్తిస్థాయిలో అతడు కనిపిస్తూనే ఉంటాడు. అయినా కూడా అతనికి పాత్రకు సరైన ప్రాముఖ్యత ఇవ్వలేదని అనిపిస్తుంది. కానీ సినిమా పూర్తి అయ్యేసరికి అతడి నటనకు అందరూ ఫిదా అనే విధంగా ఉంటుంది. ఈ చిత్రంలో నటించడానికి క్లైమాక్స్ దాదాపు పూర్తయిన తర్వాత అతడికి కాస్త స్కోప్ దొరికిందని చెప్పవచ్చు.

Ads

అదేంటి సినిమా అయిపోయిన తరువాత ఇతడు ఇప్పుడే సరిగ్గా నటిస్తున్నాడు చాలా బాగా చేస్తున్నాడు సూపర్ గా నటించాడు అని ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఫీలయ్యే విధంగా లక్ష్మణ్ పాత్ర తీరు ఉంటుంది. ఈ సినిమాతో బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు లక్ష్మణ్. అయితే ఈ సినిమాలో అతని పాత్ర చూసిన చాలామంది అతన్ని నటనకు ఫిదా అవడంతో పాటు అతనిలో టాలెంట్ ఉంది ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇతను చెప్పింది కూడా నిజమే కదా. ఇతను నటించిన ప్రతి సినిమాలో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు. మంగళవారం సినిమాలో సినిమా మొత్తానికి ఇతని పెర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలిచింది. కాబట్టి ఇలాంటి గొప్ప నటులకి ఇంకా అవకాశాలు రావాలి. ఇంకా మంచి గుర్తింపు పొంది ఇంకా మంచి పాత్రలు చేయాలి.

Previous articleపగటిపూట నైటీలు వేసుకోవడం వల్ల ఎన్ని నష్టాలు జరుగుతాయో తెలుసా..?
Next article“స్కంద” సినిమాలో… “లాజిక్” లేకుండా తీసిన 5 సీన్స్ ఇవే..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.