ఇవి ఫ్రిడ్జ్ లో పెడితే ఇక విషం కన్నా ప్రమాదం… తెలుసా..?

Ads

ఈ మధ్యకాలంలో ఫ్రిడ్జ్ మన ఇంట్లో భాగమైపోయింది. ఫ్రిడ్జ్ లో మనం అన్ని ఆహార పదార్థాలు అన్ని పెట్టేస్తున్నాము. కూరగాయలు, పాలు, నీళ్లు ఇలా ఎవరికి ఇష్టమైన వాటిని వాళ్ళు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తూ ఉంటారు. కూరగాయలు పండ్లు వంటివి పెట్టడం వలన ఎక్కువ రోజులు అవి నిల్వ ఉంటాయి. ముఖ్యంగా వేసవిలో నీళ్లు, డ్రింక్స్, జ్యూస్లు, పండ్లు వీటిని అన్నిటిని ఎక్కువగా పెడుతూ ఉంటారు.

నిజానికి కొన్ని ఆహార పదార్థాలని అసలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు మరి ఎటువంటి ఆహార పదార్థాలను ఫ్రిజ్లో పెట్టకూడదు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Ads

  1. బంగాళదుంపల్ని ఫ్రిడ్జ్ లో అసలు పెట్టకండి. బంగాళాదుంపలు చల్లటి ప్రదేశంలో లేదంటే ఫ్రిడ్జ్ లో కానీ పెడితే వాటిలో చక్కెర శాతం ఎక్కువ అవుతుంది. దీని వలన రుచి కూడా మారిపోతుంది.
  2. ఉల్లిపాయలను కూడా ఫ్రిడ్జ్ లో అసలు పెట్టకండి ఫ్రిడ్జ్ లో ఉల్లిపాయలని పెట్టడం వలన ఆ వాసన మిగిలిన కూరగాయలకి పట్టేస్తుంది. ముఖ్యంగా తరిగిన ఉల్లిపాయల్ని అసలు పెట్టొద్దు.
  3. పుచ్చకాయలని కూడా ఫ్రిడ్జ్ లో పెడుతూ ఉంటారు చాలామంది. పుచ్చకాయలని కట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెడితే బాక్స్ లో లేదంటే గిన్నెలో వేసి పెట్టండి.
  4. పువ్వులని అస్సలు ఫ్రిడ్జ్ లో పెట్టకండి. దీని వలన ఫ్రిడ్జ్ అంతా కూడా పూల వాసనతో నిండిపోతుంది. ఆహార పదార్థాలపై ప్రభావం చూపిస్తుంది ఆ వాసన.
  5. అరటిపండ్లని ఫ్రిడ్జ్ లో పెడితే అందులో ఉండే ఎంజైమ్స్ తగ్గిపోతాయి త్వరగా పాడైపోతాయి కూడా.
    ఫ్రిడ్జ్ లో బ్రెడ్ ని పెడితే బ్రెడ్ గట్టిగా మారిపోతుంది తినలేము కూడా. ఒకవేళ కనుక బ్రెడ్ ని పెట్టాలనుకుంటే ఒక కవర్లో వేసి పెట్టండి.
  6. తేనెని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టకండి. ఫ్రిడ్జ్ లో పెడితే తేనె రుచి మారిపోతుంది.
Previous articleమంగళవారం నాడు జుట్టు, గోళ్లు ఎందుకు కత్తిరించకూడదు..? దాని వెనుక ఇంత పెద్ద కారణం ఉందని తెలుసా…?
Next articleపూర్వం ఎలా హెయిర్ కట్, షేవింగ్ చేసుకునేవారు..? పరికరాలు లేవు కదా ఏం చేసేవారు..?