Ads
నరుని దృష్టికి నల్ల రాయి కూడా పగులుతుందనే సామెతను వింటూ ఉంటాం. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి అంటూ అమ్మమ్మ, బామ్మలు తీయడం అనేది అందరికీ తెలిసిందే. దిష్టి తీయడమనేది అనాది కాలం నుంచే వస్తోంది.
హాస్పిటల్‌కు వెళ్తే వ్యాధి కూడా నయం అవుతుందేమో కానీ, కానీ నర దిష్టి, నర ఘోషను పోగొట్టడానికి తాంత్రిక విద్యలు సైతం పని చేయవట. నర దిష్టి పోవడానికి పాతకాలంలో నాటువైద్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం అలాంటి వాటికి ప్రాధాన్యత లేదు. అయితే ఒక మొక్కను ఇంటి గుమ్మం దగ్గర పెడితే దిష్టి పోతుందంట. ఆ మొక్క ఏమిటో ఇప్పుడు చూద్దాం..
Ads
మనిషి దృష్టికి మరియు మాటకు శక్తి ఉంటుందని అందువల్ల నర దిష్టి, నర ఘోష అనేవి ఉంటాయని పండితులు అంటున్నారు. ప్రతి మనిషి చుట్టూ ఆరా ఎల్లప్పుడూ ఉంటుందని, మనల్ని ఇతరులు తదేకంగా లేదా చాలా సార్లు చూసినప్పుడు ఆరా అనేది దెబ్బతింటుందట. అందరి మనస్తత్వం ఒకే విధంగా ఉండదు. కొందరు ఇతరుల మంచిని ఆశించరు.
అలాంటి వారు ఒకరి గురించి, లేదా వారు చేసే పని గురించి, లేదా వ్యాపారం గురించి ఎక్కువగా మాట్లాడడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నారో వారి పాజిటివ్ ఎనర్జీని పోగొడుతుందని, తద్వారా అనారోగ్య సమస్యలు, బిజినెస్ లో నష్టం, ఫ్యామిలిలో కలహాలు లాంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
ఇలాంటి సమయంలో నర దిష్టి, నర ఘోష తగలకుండా ఉండాలంటే ఇంటి గుమ్మం దగ్గర ఎపోర్భియా అనే మొక్కను పెట్టుకోంటే మంచిదంట. ఈ మొక్క ఏడాది పాటు నేల పై నాటితే వాటర్ లేకపోయినా జీవిస్తుంది. ఇది ఎడారి మొక్క. దీనికి ఉండే ముళ్ళు దిష్టిని తీసుకుని అది ఇంటి పై పడకుండా చేస్తుంది. ఈ మొక్కని దిష్టి మొక్క అని పిలుస్తారు. ఇది ఇంటి ముందు ఉండడం వల్ల దిష్టి తగలదు.
Also Read: ఎందుకు అంత్యక్రియలు చేసేటప్పుడు కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు…?