ఆ వెంకీ సినిమాకి అప్పుడే 25 ఏళ్లు అంట…ఆటోలో తిరుగుతూ సెలెబ్రేట్ చేసుకున్న ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా.?

Ads

విక్టరీ వెంకటేష్ హీరోగా, జయంత్‌ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ప్రేమంటే ఇదేరా. ఈ మూవీ 1998లో రిలీజ్ అయ్యి, బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈతరం వారికి ఈ మూవీ గురించి అంతగా తెలియకపోవచ్చు. కానీ అప్పటి ప్రేక్షకలను ఎంతగా ఆకట్టుకుందో, ఆ మూవీ సాధించిన కలెక్షన్స్ ను బట్టి తెలుసుకోవచ్చు.

ఈ మూవీ ద్వారా ప్రీతి జింటా హీరోయిన్‌ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈ మూవీ హీరోయిన్ మరియు దర్శకుడు ముంబై వీధుల్లో ఆటో రైడ్ చేశారు. ఇన్నేళ్ల తరువాత వీళ్లిద్దరూ ఇలా కలవడం వెనుక ఉన్న కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
వెంకటేష్, ప్రీతి జింటా జంటగా వచ్చిన ప్రేమంటే ఇదేరా మూవీ అప్పటి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ముఖ్యంగా ఈ సొట్టబుగ్గల బ్యూటీకి అప్పటి యూత్ ఫిదా అయ్యారు. సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. అప్పట్లో ఈ ఎక్కడ చూసిన ఈ మూవీ పాటలే వినిపించేవి. ప్రీతి జింటా నటించింది రెండు తెలుగు సినిమాలే అయిన ఆమె చేసిన క్యారెక్టర్స్ తెలుగు ఆడియెన్స్ కి ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
ఈ మూవీకి డైరెక్టర్ జయంత్‌ సి పరాన్జీ దర్శకత్వం వహించారు. ఆయన తెలుగు అగ్ర హీరోలతో చిత్రాలు తీసి, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించాడు. తాజాగా ప్రీతి జింటా, జయంత్‌ సి పరాన్జీ ముంబై వీధుల్లో ఆటోలో తిరిగిన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రేమంటే ఇదేరా మూవీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడానికి జయంత్‌, ప్రీతి కలిసి ఆటోలో తిరుగుతూ అప్పటి మధుర క్షణాలను జ్ఞాపకం చేసుకున్నారు. ఈ సంతోషాన్ని ఇద్దరు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. వీరు తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జయంత్ సీ పరాన్జీ 2017లో జయదేవ్‌ మూవీని తెరకెక్కించాడు. ఈ మూవీతో చివరిసారిగా ఆడియెన్స్ ని పలుకరించాడు. ఇక హీరోయిన్ ప్రీతి జింటా సినిమాలకు దూరంగా ఉండి దాదాపు ఐదు సంవత్సరాలు అవుతుంది. ఆమె విదేశాల్లో స్థిరపడినట్టు తెలుస్తోంది.

Also Read: KEEDAA COLA REVIEW : తరుణ్ భాస్కర్ – బ్రహ్మానందంల “కీడా కోలా” ఎలా ఉంది.? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Previous articleమూడు సార్లు ఎమ్మెల్యే.. సొంతిల్లు లేదు.. ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించిన ఆయనెవరో తెలుసా..?
Next articleగుమ్మం దగ్గర ఈ మొక్క పెడితే…ఇంటికి నర దిష్టి ఉండదట! ఇదేంటో తెలుసా.?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.