Ads
విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ పేరుని సార్ధకం చేసిన ఎన్టీ రామరావుగారు సినిఇండస్ట్రీలోనే కాకండా రాజకీయలలో కూడా తిరుగులేని హీరోగా నిలిచారు. తెలుగువారు ఎన్టీఆర్ ను హీరోగా కాకుండా దేవుడిలాగే భావించేవారు.
Ads
ఎన్టీఆర్ తెలుగు ఇండస్ట్రీలో చాలా క్రమశిక్షణ కలిగిన యాక్టర్ మాత్రమే కాకుండా చాలామంది నటులకు క్రమశిక్షణ నేర్పిన నటుడిగా కూడా ఎన్టీఆర్‌కు పేరు వచ్చింది. ఆయన రాముడు, కృష్ణుడు లాంటి ఎన్నో పౌరాణిక పాత్రలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఆయన ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదట్లో తనకు వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకుని, మూడు షిఫ్టుల్లో పనిచేసేవారు. అయితే అంత బిజీగా ఉండే ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు గురించిన విషయాలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.రామరావుగారు ఉదయం అరచేతి మందం ఉండే ఇడ్లీలను 20 వరకు సులభంగా తినేవారంట. ఇంట్లోనే మేకప్ వేసుకొని షూటింగ్ కి వెళ్లేవారు. షూటింగ్ విరామంలో ఆపిల్ జ్యూస్ తీసుకునేవారంట. రామరావుగారు ఆపిల్ జ్యూస్ ని బాగా ఇష్ట పడేవారని ఆయన సన్నిహితులు చెప్పేవారు. ఆయన రోజుకు ఐదు బాటిల్స్ ఆపిల్ జ్యూస్ తాగేవారంట.ఇక ఎన్టీఆర్ సాయంత్రం టైమ్ లో స్నాక్స్ కి బజ్జీలు తినడానికి చాలా ఇష్టం పడేవారంట. ఎన్టీఆర్ డ్రైఫ్రూట్స్ కూడా ఇష్టంగా తినేవారు. ఇంకా రోజుకి బాదంపాలు రెండు లీటర్ల తాగేవారంట. అదే వేసవి కాలంలో అయితే పగటి పూట భోజనం చేసిన తరువాత మామిడిపళ్ళ జ్యూస్ ఖచ్చితంగా తాగేవారంట. ఇక ఆ జ్యూస్ లో గ్లూకోజ్ వేసుకొని తాగడం ఎన్టీఆర్ కు చాలా ఇష్టం అంట. ఎన్టీఆర్ ఎంత ఆహారం తీసుకున్నా కూడా ఆయన చేసే పనుల వాళ్ళ ఆహారం తేలికగా అరిగిగేదని ఆయనకు దగ్గరగా ఉండేవారు చెప్పేవారు. ఎన్టీఆర్ 300లకు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన ఒప్పుకున్న చిత్రాలను తొందరగా పూర్తి చేయాలని చాలా జాగ్రత్తలు తీసుకునేవారని ఆయన సన్నిహితులు తెలిపారు.