హీరోయిన్ గా మారక ముందు సమంత ఎలా ఉండేదో తెలుసా?

Ads

హీరోయిన్ సమంత సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం సమంతకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఇక ఆ మధ్య వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లోను అవకాశాలను, అభిమానులను కూడా సంపాదించుకుంది సమంత.

Ads

సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ మూవీలో సమంత నర్తించిన ‘ఊ అంటావా మావా’ పాటతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఈ స్పెషల్ సాంగ్ లో సామ్ తన ఎక్స్ ప్రెషన్స్, డ్యాన్స్ తో అందరిని ఫిదా చేసింది. ఇటీవల యశోద సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చి, హిట్ అందుకుంది. ప్రస్తుతం సమంత కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. చెప్పాలంటే స్పెషల్‌ సాంగ్స్‌కి కూడా పారితోషికం కోట్లలోనే తీసుకుంటుంది. సమంత కేరళలో పుట్టి పెరిగింది. అయితే ఆమె తల్లిదండ్రులు ఉద్యోగం కారణంగా తమిళనాడులో స్థిరపడ్డారు. సమంత అక్కడే చదువు పూర్తి చేసింది. ఆమెకి డిగ్రీ చదివే రోజుల్లోనే నటన పై ఇంట్రెస్ట్ ఉండడంతో  కాలేజీ ఈవెంట్లలో పాల్గొనేది. ఆ సమయంలో తమిళనాడుకి చెందిన ఆషిక టెక్స్ టైల్స్ ఉత్పత్తుల యాడ్‌లో నటించే ఛాన్స్ వచ్చింది.పాకెట్ మనీ కోసం సమంత ఆ యాడ్‌లో యాక్ట్ చేసింది. దీనికి గాను ఆమెకి ఐదు వేల రూపాయలు పారితోషకం ఇచ్చారంట. అయితే ఆ యాడ్‌ యూట్యూబ్ లో షికారు చేస్తోంది. అయితే అప్పటికి, ఇప్పటికి సమంతలో చాలా మార్పు కనిపిస్తోంది. అది చూసిన వారు ఆమె హీరోయిన్ సమంత నేనా అంటున్నారు.సమంత మోడలింగ్ తరువాత సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ‘ఏ మాయ చేసావే’ సమంత మొదటి సినిమా. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దాంతో ఆమె అక్కడి నుంచి వెనుతిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. తెలుగు, తమిళ సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

Also Read: మిర్చి మూవీలో డార్లింగే పాటలో హీరోయిన్ అనుష్క ప‌క్క‌న స్టెప్పులు వేసిన ఈ సైడ్ డ్యాన్స‌ర్ ఎవరో తెలుసా?

Previous articleఎన్టీ రామరావుగారి ఆహారపు అల‌వాట్ల గురించి తెలుసా?
Next articleకొరటాల శివ డైరెక్షన్ చేసిన ఈ 4 సినిమాలలో ఉన్న కామన్ పాయింట్ ఏమిటో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.