Ads
సినిమాలను పోల్చి చూడడం అనేది ఈ మధ్య కాలంలో సాధారణం అయిపోయింది. అందులోనూ అగ్ర దర్శకుల సినిమాల విషయంలో ఇది ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత సినిమాల గురించిన చిన్న విషయం కూడా వైరల్ అవ్వడం, చిత్రాల్లోని చిన్న మిస్టేక్ ని కూడా ట్రోల్ అవ్వడం కామన్ అయిపోయింది.
ఇటీవల అలాంటిదే సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. మరి ఆ వివరాలు ఏమిటో చూద్దాం. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సింహాద్రి 2003లో వచ్చిన హిట్ సినిమా. ఈ సినిమాలో భూమిక, అంకిత హీరోయిన్లుగా నటించగా బానుచందర్, నాజర్, సీత ఇతర పాత్రలలో నటించారు. ఈ మూవీకి విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా, సంగీతం ఎం.ఎం కీరవాణి అందించారు. ఈ మూవీ భారీ అంచనాల మధ్య జులై 9న 2003లో రిలీజ్ అయింది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది మూవీ 2013లో సెప్టెంబర్ 27న విడుదల అయ్యింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. నదియా, రావురమేష్, బోమన్ ఇరానీ, ముకేష్ ఋషి ఇతర పాత్రలలో నటించారు. ఈ సినిమాలో పవన్కళ్యాణ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలోని అన్ని పాటలు అలరించాయి. ఇక వివరాల్లోకి వెళ్తే, రెండు సినిమాలలోను ధనవంతుడైన వ్యక్తి కూతురు సాధారణ వ్యక్తిని ప్రేమించడం, తండ్రి ఒప్పుకోకపోవడంతో ప్రేమించిన వ్యక్తితో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని, సంతోషంగా ఉంటారు. వారికి కూతురు కూడా ఉంటుంది. ఇది సినిమా మొదట్లో జరుగుతుంది. కట్ చేస్తే ఆ తండ్రి తన కూతురిని తలచుకుని బాధపడడంతో ఆమెను తీసుకురావడం కోసం హీరో వాళ్ళింటికి వెళ్తాడు. వారి కూతురు అయిన హీరోయిన్ ను ప్రేమించి, హీరోయిన్ ను తీసుకెళ్లాడానికి ప్రయత్నించడంతో ఆమె తండ్రి అడ్డుకోవడం జరుగుతుంది. అప్పుడు హీరో మీరు మీ కూతురిని తీసుకువెళ్లాలనుకుంటేనే బాధ పడుతున్నారు. మరి మీరు ఇంకొకరి కూతురు తీసుకురావడం తప్పు కాదా అని హీరోయిన్ తండ్రికి క్లాస్ ఇస్తాడు. ఈ రెండు సినిమాలలోను సేమ్ సన్నివేశాలు ఉంటాయి. ఇది గమనించిన నెటిజెన్లు ఈ వీడియోలను షేర్ చేస్తూ ముందు తప్పు చేయించి చివర్లో లెక్చర్ ఇవ్వడం అవసరమా అని కామెంట్స్ చేస్తున్నారు.
Ads
Also Read: క్లైమాక్స్ లో హీరో చనిపోవడం వల్ల అపజయం పొందిన సినిమాలు ఏమిటో తెలుసా?
View this post on Instagram