Ads
ఎండాకాలం వచ్చిందంటే చాలు దాదాపు ప్రతి ఇంట్లోను పుచ్చకాయ ఉంటుంది. సమ్మర్ లో లభించే పండ్లలో వాటర్ మెలన్ ఒకటి. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. అంతే కాకుండా పుచ్చకాయలో ఉండే పోషకాల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
ముఖ్యంగా అమైనో ఆమ్లం సిట్రులైన్ అనే అమైనో ఆమ్లము రక్తపోటును నియంత్రిస్తుంది. అంతే కాకుండా రక్త ప్రవాహాన్ని మెరుగు పరచడం కోసం నైట్రిక్ ఆక్సైడ్ యొక్క ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఎండాకాలంలో పుచ్చకాయలను తినడం ఆరోగ్యకరమైనది. వాటర్ మెలన్ సూపర్ హైడ్రేటింగా పని చేస్తుంది. తక్కువ సమయంలోనే శరీరాన్ని చల్లబరుస్తుంది. అయితే చాలా మంది చల్లగా ఉండడం కోసం పుచ్చకాయను ఫ్రిజ్ లో పెడుతుంటారు. కానీ వాటర్ మెలన్ ను ఫ్రిజ్ లో పెట్టడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మరి పుచ్చకాయను ఎందుకు ప్రిజ లో పెట్టకూడదో ఇప్పుడు చూద్దాం..
వాటర్ మెలన్ లో తక్కువ కేలరీలు ఉంటాయి. దీని వల్ల శరీరంలో షుగర్ స్థాయి నియంత్రించ బడుతుంది. దీనిని జ్యూస్ గా కూడా తీసుకోవచ్చు. పుచ్చకాయలో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. ఇందులో ఎలక్ట్రోలైట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇందులో విటమిన్లు, ప్రొటీన్లు, పీచు లాంటి పోషకాలు ఉంటాయి. దీనిలో ఉండే పీచు పదార్ధం ఆకలిని నియంత్రిస్తుంది. సులువుగా బరువు తగ్గవచ్చు. పుచ్చకాయ డైటింగ్ లో ఉన్నవారికి చాలా అనువైనదని నిపుణులు కూడా చెబుతున్నారు.
అయితే ఎక్కువ మంది పుచ్చకాయను తెచ్చిన తరువాత కట్ చేసి రిఫ్రిజిరేటర్ లో పెడుతూ ఉంటారు. ఇలా చేసినట్లయితే వాటర్ మెలన్ లో ఉండే పోషక విలువలు తగ్గిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటర్ మెలన్ ను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. పుచ్చకాయ బయటి భాగం మందంగా ఉండడం వల్ల పుచ్చకాయ అంత త్వరగా చెడిపోదు.
దాదాపు 15 నుండి 20 రోజుల వరకు ఉంటుంది. అందువల్ల దీనిని రిఫ్రిజిరేటర్ లో పెట్టాల్సిన పని లేదు.పుచ్చకాయని కట్ చేసి ఫ్రిజ్‌లో పెడితే, దానిలో ఉండే పోషక విలువలు, కెరోటినాయిడ్ స్థాయి కూడా తగ్గుతుంది.చల్లగా ఉండే పుచ్చకాయ తినడం ద్వారా జలుబు, దగ్గు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే చాలా సమయం పాటు రిఫ్రిజిరేటర్ లో ఉంచిన పుచ్చకాయ తినడం వల్ల ఫుడ్-పాయిజన్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల తాజా వాటర్ మెలన్ ను తినండి.
Ads
Also Read: విపరీతమైన డిప్రెషన్, గుండె జబ్బులకు కారణం కరోనా.. రీసెర్చ్ లో విస్తుపోయే నిజాలు..