విరూపాక్ష సినిమాలో హీరోయిన్ తల్లిగా నటించిన ఆమె ఎవరు..? బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

Ads

సాయి ధరమ్ తేజ కథానాయకుడిగా నటించినా లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా విరూపాక్ష సినిమా అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చింది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను బాగానే మెప్పించింది. 100 కోట్ల వసూళ్లను కూడా ఈ సినిమా రాబట్టడం విశేషం. ఈ సినిమాలో నటీ నటులు ఎంతో అద్భుతంగా నటించారు.

ముఖ్యంగా హీరోయిన్ తల్లి పాత్ర లో నటించిన ఆమె చాలా చక్కగా నటించారు అయితే ఆమె ఎవరు..? ఆమె వివరాలు ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా ఆరా తీస్తున్నారు. ఇక మరి ఆమె గురించి చూద్దాం… ఈ సినిమాలో ఆమె చాలా తక్కువ సేపు మాత్రమే కనపడతారు. కానీ అందరికీ బాగా గుర్తుండిపోయారు.

ఆమె ఎవరో కాదు సాయి కామాక్షి భాస్కర్ల. ఇక ఈమె వివరాల్లోకి వెళితే…. సాయి కామాక్షి భాస్కర్ల మొదటప్రియురాలు అనే సినిమాలో చేశారు ఆ సినిమాతోనే ఆమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ సినిమా తర్వాత చాలా సినిమాల్లో నటించారు. ఇప్పుడు విరుపాక్ష సినిమాలో కనపడి అందరిని ఆకట్టుకున్నారు.

Ads

ఈమె ప్రొఫెషనల్ గా డాక్టర్ ఎంబిబిఎస్ చదువుతున్నప్పుడు సాయి కామాక్షి 2018 వ సంవత్సరం గాను సెమినా మిస్ తెలంగాణ కిరీటాన్ని పొందారు. ఆ తర్వాత మిస్ ఇండియా పోటీల్లో కూడా పాల్గొన్నారు. మిస్ ఇండియా 2018 పోటీల్లోనూ కామాక్షి పాల్గొని ఫైనాన్స్ వరకు వెళ్లారు చైనాలో మెడిసిన్ చేశారు ఈమె అపోలో హాస్పిటల్లో కూడా కొన్ని రోజులు పని చేశారు.

సినీ రంగం మీద ఇష్టంతో సినీ ఇండస్ట్రీకి వచ్చారు. మోడల్ గా కూడా చేస్తూ ఉంటారు వచ్చిన అవకాశాలని వినియోగించుకుంటూ ఉంటారు. ప్రియురాలు సినిమాలో ఈమె హీరోయిన్ గా నటించారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో అక్కినేని అఖిల్ అమెరికా ఫ్రెండ్స్ బ్యాచ్ లో కూడా ఈమె కనపడతారు.

రౌడీ బాయ్స్, విరుపాక్ష వంటి సినిమాల్లో ఈమె నటించారు పలు వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించి కామాక్షి ఆకట్టుకున్నారు. నటన మీద ఆసక్తితో ధియేటర్ ఆర్ట్స్ కి ప్రవేశించి శిక్షణ పొందారు కవితలు కథలు కూడా రాస్తూ ఉంటారు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు.

Previous articleచిరంజీవి, బాలకృష్ణ కలిసి నటించిన సినిమా మీకు తెలుసా..?
Next articleఫ్రిజ్ లో పెట్టిన పుచ్చకాయను తింటున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే.. ఎందుకంటే?