‘దృశ్యం’ మూవీలో నటించిన వెంకటేష్ పెద్ద కూతురు ఇప్పుడు ఎలా ఉందో? ఏం చేస్తుందో తెలుసా?

Ads

విక్టరీ వెంకటేష్ హీరోగా 2014లో వచ్చిన దృశ్యం మూవీ అందరికి గుర్తు ఉండే ఉంటుంది. ఈ సినిమాలో వెంకటేష్ కు భార్యగా సీనియర్ హీరోయిన్ మీనా నటించింది. ఇక ఈ చిత్రంలో వెంకటేష్, మీనా జంటకు ఇద్దరు కూతుర్లు ఉంటారు.

Ads

వారిలో చిన్న కుమార్తెగా మలయాళ బాలనటి ఎస్తేర్ నటించి, ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. వెంకటేష్ పెద్ద కుమార్తెగా నటించిన హీరోయిన్ ఎవరో కాదు బేసిక్‌గా క్లాసికల్ డ్యాన్సర్ అయిన ఆమె పేరు కృతిక జయకుమార్. ఈమె తెలుగులో నటించింది తక్కువ సినిమాలే.
బెంగళూరుకు చెందిన ఆమె, మొదటి నుండి కూడా సినిమాలకు దూరంగానే ఉంది. కృతిక ఏడేళ్ల వయస్సులోనే భరతనాట్యం పై ఇష్టం పెంచుకుంది. అందులో శిక్షణ తీసుకుని క్లాసికల్ డ్యాన్సర్ గా ఎన్నో షోలలో తన ప్రతిభను ప్రదర్శించింది. అయితే మలయాళం డైరెక్టర్ బాలు కిరియత్ తిరువనంతపురంలో ఆమెను చూసి సినిమాల్లో ప్రయత్నించమని సలహా ఇచ్చారు.
ఆయన చెప్పినట్టుగానే ఆమె సినిమాలలో ప్రయత్నించడం మొదలుపెట్టింది. ఆ క్రమంలోనే తెలుగు దృశ్యం యాక్టర్స్ కోసం నిర్వహిస్తున్న ఆడిషన్ కు వెళ్ళగా, అందులో ఆమె సెలెక్ట్ అయింది. అలా సినీ పరిశ్రమలోకి రంగ ప్రవేశం చేసింది. 2014లో విడుదలయిన దృశ్యం సినిమాతో కృతిక జయకుమార్ కు గుర్తింపు లభించింది.
ఆ తరువాత సంవత్సరంలో కన్నడ ఇండస్ట్రీలో ‘బాక్సర్’ సినిమాలో అవకాశం వచ్చింది. అదే ఏడాది టాలీవుడ్ లో ‘వినవయ్యా రామయ్య’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తరువాత రోజులు మారాయి, ఇంట్లో దెయ్యం నాకేం భయం లాంటి సినిమాలలో నటించిన కృతికకు ఆ తరువాత పెద్దగా అవకాశాలు రాలేదనే చెప్పాలి. ఇక 2021 లో దృశ్యం సీక్వెల్ తో ఆడియెన్స్ ని పలకరించింది ఈ అందాల భామ.

Also Read: అచ్చం ప్రభాస్ లాగే ఉన్న ఈ ఫోటోలోని వ్యక్తి కూడా ఒక నటుడే.. అతను ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Previous articleశ్రీలీల లాగే తమ డ్యాన్స్ తో భారతీయ సినీ పరిశ్రమను ఊపేసిన 10 మంది హీరోయిన్లు వీరే..
Next articleOTT లోకి కొత్తగా వచ్చిన ఈ వెబ్ సిరీస్ చూశారా..? దీని కథ ఏంటంటే..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.