అచ్చం ప్రభాస్ లాగే ఉన్న ఈ ఫోటోలోని వ్యక్తి కూడా ఒక నటుడే.. అతను ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Ads

ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ కాగా, ఆ ఫోటోలలో ఉన్న వ్యక్తిని చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఆశ్చర్య పోతున్నారు. ఎందుకంటే ఆ వ్యక్తి  ప్రభాస్ లాగానే కనిపిస్తున్నాడు.

Ads

అసలు ఎవరు ఆ వ్యక్తి అని నెటిజన్లు చర్చలు జరుపుతున్నారు. అంతేకాకుండా ఆ వ్యక్తి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లాగా ఎందుకు ఉన్నాడని, అతని గురించి తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు. ఇక నెట్టింట్లో వైరల్ అయిన ఆ ఫోటోలలో ఉన్న వ్యక్తి అశీష్ కపూర్. ఆయన ఒక బాలీవుడ్ నటుడు. అశీష్ సూపర్ హిట్ అయిన చాలా హిందీ సీరియల్స్ లలో నటించారు.
అశీష్ సీరియల్స్ లోనే కాకుండా అనేక సినిమాలలో కూడా నటించారు. అంతేకాకుండా ఒక మూవీకి నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఆయన సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారు. అశీష్ కు ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది. తరచుగా తన వర్క్ అవుట్ చేసే ఫోటోలు మరియు పర్సనల్ ఫోటోలు తన సోషల్ మీడియా ఖాతాలో ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు. అలా ఆశిష్ పెట్టిన ఈ ఫోటోలను చూసిన ప్రభాస్ అభిమానులు చూసి కొన్ని యాంగిల్స్ లో అతను అచ్చం ప్రభాస్ లాగానే ఉన్నారని, ఆ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు.
ఇక హీరో ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సలార్’ సినిమాలోనూ, ఓం రౌత్ డైరెక్షన్ లో రూపొందుతున్న ‘ ఆదిపురుష్’ నటించారు. అంతేకాకుండా ప్రాజెక్ట్ కె లో కూడా ప్రభాస్ నటిస్తున్నారు. ఈ సినిమాలో దీపిక పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ కు ప్రస్తుతం క్రేజ్ మాములుగా లేదు. ప్రభాస్ నటించిన సినిమాలన్ని కూడా తెలుగులోనే కాకుండా పాటు తమిళ, మలయాళం, కన్నడ,హిందీ భాషలలో విడుదల అవనున్నాయి.

Also Read: గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు అందుకున్న”నాటు నాటు” పాట గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు..

 

Previous articleజయలలిత లెటర్ లో రజనీకాంత్ గురించి ఎందుకు మాట్లాడారు..? సినిమా వద్దు అనడానికి కారణం ఏంటి..?
Next article“అనంత్ అంబానీ-రాధిక మర్చంట్” లవ్ స్టోరీ గురించి తెలుసా..? వీరి ప్రేమ కథ ఎలా మొదలయ్యింది అంటే..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.