Ads
సూపర్ స్టార్ రజినీకాంత్ గత ఏడాది జైలర్ మూవీతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇపుడు లాల్ సలామ్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ మూవీలో విష్ణు విశాల్, విక్రాంత్ లు లీడ్ రోల్స్ లో నటిస్తుండగా, రజినికాంత్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ తో ఈ మూవీ పై భారీ అంచనాలు పెరిగాయి. రీసెంట్ గా తమిళ ట్రైలర్ విడుదల చేయగా, తాజాగా తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఇక రజినీకాంత్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. అయితే ఆయన వాయిస్ విన్నవారు షాక్ అయ్యారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
రజినీకాంత్, విష్ణు విశాల్, విక్రాంత్ కలిసి నటించిన లాల్ సలామ్ మూవీకి రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 9న ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్ లో ‘మతాన్ని నమ్మితే మనసులో ఉంచుకో, మానవత్వాన్ని అందరితో పంచుకో. ఇండియన్‌గా నేర్చుకోవల్సింది అదే’ అని రజనీకాంత్ డైలాగ్ ట్రైలర్ లో హైలైట్ అయ్యింది.
అయితే రజినీ వాయిస్ డైలాగ్ కింగ్ సాయికుమార్ వాయిస్ లో రావడంతో ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. కొన్ని గంటలలో మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో రిలీజ్ అయిన ట్రైలర్ లో గంభీరంగా వినిపిస్తున్నా, రజినికాంత్ వాయిస్ డిఫరెంట్ గా అనిపిస్తోందని టాక్. రజినీకాంత్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఆయన వాయిస్. ఆయన సినిమాలలో తెలుగులో రజినీకాంత్‌కు మనో, సాయి కుమార్, ఎస్పీబీ, లాంటి వారు డబ్బింగ్ చెబుతుంటారు. అయితే ఎక్కువగా మనో రజినికాంత్ కు డబ్బింగ్ చెప్పడంతో రజినీకాంత్ కు డబ్బింగ్ మనో అయితేనే పర్ఫెక్ట్ అని అంతా భావిస్తుంటారు.రెగ్యులర్ గా రజినీకి డబ్బింగ్ చెప్పే మనో కాకుండా సాయికుమార్ ను ఎందుకు పెట్టారనే సందేహం ఫ్యాన్స్ లో కలుగుతోంది. కానీ కొన్నిసార్లు ట్రైలర్ వరకు ఒకరు డబ్బింగ్ చెప్పి, సినిమాలో మార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది తెలియదు. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. గతంలో అంటే 30 సంవత్సరాల క్రితం రజనీకాంత్ కు డబ్బింగ్ చెప్పిన వ్యక్తి సాయి కుమార్. బాషా, పెదరాయుడు, బిర్లా రాముడు, రాజా చిన్న రోజా వంటి చాలా సినిమాలకు సాయికుమార్ అద్భుతంగా వాయిస్ ఇచ్చారు. బాషాలో ‘నేనొక్కసారి చెబితే’ అనే డైలాగ్ అంత ఈజిగా మర్చిపోలేరు.
Ads
watch trailer :