Ads
డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ గురించి మనందరికీ తెలిసిందే. ఆయన పూర్తి పేరు ఈదర వీర వెంకట సత్యనారాయణ. ఈయన సినిమాలపై ఇంట్రెస్ట్ తో సినిమా ఇండస్ట్రీకి ఇచ్చి మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ను మొదలుపెట్టి ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆ సమయంలోనే జంబలకడిపంబ సినిమా కథను రాసి ఆంధ్రజ్యోతి సపరివార వాత్రాపత్రికకు పంపించగా ఇది కూడా ఒక కథనా అంటూ వాళ్ళు వెనక్కి పంపించారట. ఆ జంబలకడిపంబ కథతో ఈవీవీ అద్భుతమైన సినిమాను తీయాలని దర్శకుడుగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని భావించారట. మొదట అందులో హీరోగా రాజేంద్రప్రసాద్ అనుకుని రాశారట.
Ads
ఇక డైరెక్టర్ గా తనకంటూ ఓ గుర్తింపు వచ్చిన తర్వాత ఈ సినిమా చేయటానికి సన్నాహాలు చేశారు. అయితే ఆ సమయంలో రాజేంద్రప్రసాద్ బిజీగా ఉండటం వల్ల నరేష్ ను హీరోగా తీసుకోవాల్సి వచ్చింది. ఇక హీరోయిన్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎవరూ కుదరకపోవడంతో ఆమనిని ఎంపిక చేశారు. డివివి దానయ్య, ఆచంట గోపినాథ్ నిర్మాతలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నెల రోజుల వ్యవధిలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఈ సినిమాను 1992 జులై 12వ తేదీ ఈ సినిమాని విడుదల చేశారు. ఇలా 50 లక్షల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రెండు కోట్లు వసూలు చేసిందట.
ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ అప్పట్లో ఒక సెన్సేషన్ గా మిగిలిపోయింది. ఆడవారు మగవారిగా, మగవారు ఆడవారుగా నటించడంతో ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. ఈ సినిమా హిట్ కావడంతో హీరోయిన్ ఆమనికి వరుస అవకాశాలు వచ్చాయి. ఈ సినిమా 100 రోజుల వేడుకకు ముఖ్య అతిథిగా హీరో రాజేంద్రప్రసాద్ హాజరయ్యారట.