Ads
దోమలు కుట్టకుండా ఉండడం చాలా ముఖ్యం. దోమలు కుడితే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. దోమల వల్ల తీవ్రమైన వ్యాధి మలేరియా కూడా రావచ్చు. ఇలాంటి వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలి. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి చాలామంది సీజనల్ వ్యాధులకి గురవుతూ ఉంటారు. ముఖ్యంగా దోమల వల్ల వచ్చే చికెన్ గన్యా, మలేరియా, డెంగ్యూ వంటివి ఎక్కువగా వస్తుంటాయి
అందుకని చిన్నారులు వున్నా శిశువులు వున్నా జాగ్రత్తగా చూసుకోవాలి. దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పైగా చిన్నారులకి దోమ కుడుతుంది అన్న విషయం తెలియదు.
అలాంటప్పుడు దోమలు లేకుండా ఉన్నచోటనే వాళ్ళని ఉంచాలి. దోమలు లేకుండా ప్రత్యేక పద్ధతుల్ని పాటించాలి. అలానే పిల్లలు ఆడుకునే చోటు కూడా శుభ్రంగా ఉండాలి. దోమలు ఎక్కువగా ఉన్న దగ్గర పిల్లలు ఆడకుండా చూసుకోవాలి వీలైనంత వరకు ఇంటిపట్టునే ఉండేటట్లు చూసుకోవాలి. అయితే దోమల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు నిపుణులు ఈరోజు చెప్పారు. ఆ విషయాలను ఇప్పుడే చూద్దాం.
Ads
- నిజానికి మగ దోమలు మనుషుల్ని కుట్టవు. ఆడ దోమలు మాత్రమే కుడతాయి. ఎందుకంటే దాని గుడ్ల అభివృద్ధికి ఆడదోమకి ప్రోటీన్ కావాలి. ఆ ప్రోటీన్ ని మనిషి యొక్క రక్తం నుండి ఆడ దోమ పొందుతుంది. అందుకే కుడుతుంది. ఒకేసారి 300 గుడ్లు పెడుతుంది. ఆడ దోమలు ఎనిమిది వారాలు మాత్రమే బతుకుతాయి. మగ దోమలు 10 రోజులు మాత్రమే.
- దోమలకు ఆరు కాళ్లు ఉంటాయి. అలానే నోటిలో 47 పళ్లు ఉంటాయి.
- అలానే దోమలు ఎక్కువగా ‘ఓ’ బ్లడ్ గ్రూప్ ఉన్న వారిని కుడుతూ ఉంటాయి.
- బీర్‌ను ఇష్ట పడేవాళ్ళనే దోమలు లక్ష్యంగా చేసుకుంటాయని పరిశోధన ద్వారా తెలుస్తోంది. శరీరం నుంచి ఒక సమయంలో 0.001 నుంచి 0.1 ml రక్తాన్ని దోమలు పీల్చుకోగలవు.
- మొత్తం మూడు వేల రకాల దోమలు ఉన్నాయి. పైగా ఇతర జీవుల కంటే ఎక్కువ వ్యాధులను వ్యాప్తి చేస్తాయి దోమలు.