Ads
డియర్ పూరి సార్,
మీరంటే పడి చచ్చిపోయే అభిమానుల్లో నేను కూడా ఒకడిని. మీరు డైరెక్ట్ చేసే సినిమా రిలీజ్ అవుతుంది అంటే అర్ధరాత్రి వెళ్లి థియేటర్ ముందు కూర్చుంటాను. మీ సినిమాలు చూస్తూ పెరిగాను. బద్రి సినిమా చూసి, పవన్ కళ్యాణ్ ని ఎంత బాగా చూపించారో అనుకున్నాను. తర్వాత పోకిరి సినిమాను చూసి, మహేష్ బాబు లుక్ కి ఫ్యాన్ అయిపోయాను. ఆ తర్వాత మీరు తీసిన సినిమాలన్నీ చూస్తూనే ఉన్నాను. మీ సినిమాల్లో ఏదో మ్యాజిక్ ఉండేది సార్. హీరోలని అలా మార్చేస్తారు. అప్పటి వరకు ఒకలాగా ఉన్న హీరోలు, మీ సినిమాల్లో నటించాక ఇంకొక లాగా అవుతారు. ఆ మార్పు చాలా బాగుంటుంది.
మీ సినిమాల్లో పాటలు, ఫైట్స్, డైలాగ్స్, మేనరిజమ్స్, ఒకటి ఏంటి, అన్ని బాగుంటాయి. మీ సినిమా ఫ్లాప్ అయితే నేను ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. మీ ఇంటర్వ్యూలు చూసి ఇన్స్పైర్ అయ్యేవాడిని. లైఫ్ లో ఏం సాధించలేను అనే బాధ వచ్చినప్పుడు, మీ ఇంటర్వ్యూలు చూసేవాడిని. మీ పాడ్ కాస్ట్ లు వినేవాడిని. అవన్నీ వింటూ ఉంటే, ఏదో ఒక తెలియని ధైర్యం వచ్చేది. సర్టిఫికెట్స్ తగలబెట్టడం అనేది ఎవరు చేయరు. మీరు చేశారు అంటే మీకు ఎంత ధైర్యం ఉందో అని ఆశ్చర్యపోయాను. ఇలాంటి ధైర్యంలో సగం ధైర్యం నాకు ఉన్నా చాలు. నేను లైఫ్ లో నేను అనుకున్నది సాధిస్తాను అని అనుకునేవాడిని.
Ads
అలాంటి మీకు ఏమయ్యింది సార్? ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తున్నారు? అసలు మీరే డైరెక్ట్ చేస్తున్నారా? టెంపర్ సినిమాతో హిట్ కొట్టారు. బద్రి, పోకిరి అంత కాకపోయినా టెంపర్ బాగుంది. సరే తర్వాత వచ్చే సినిమాలు బాగా తీస్తారు అని ఆశ పడ్డాను. కానీ మీ సినిమాలు చూస్తూ ఉంటే పాత పూరిని మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది సార్. ఇస్మార్ట్ శంకర్ సినిమా వచ్చింది. అందరూ చాలా బాగుంది అన్నారు. కానీ నాకు నచ్చలేదు సార్. మీరు తీయాల్సిన సినిమా అది కాదు. అసలు ఆ డైలాగ్స్ ఏంటి సార్? అసలు లైగర్ లాంటి సినిమాని మీరు తీసారా అని ఇప్పటికి కూడా నమ్మలేకపోతున్నాను.
ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ టీజర్ చూశాక మళ్ళీ నిరాశగానే అనిపించింది. అంతకుముందు పంచ్ లైన్స్ మధ్యలో మీ హీరోలు తిట్లు తిడుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు తిట్ల మధ్యలో ఒక్క పంచ్ లైన్ కూడా ఉండట్లేదు. అప్పట్లో మీ సినిమాలని అభిమానించిన వారు, ఇప్పుడు మిమ్మల్ని తిడుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను సార్. ప్లీజ్, ఇంక ఇలాంటి సినిమాలు ఆపేయండి. కాస్త అప్ డేట్ అవ్వండి. మాకు మా పాత పూరి టేకింగ్ లో మాత్రమే కావాలి. కథలో కాదు. మీ బ్రాండ్ కి తగ్గ సినిమా ఒక్కటి తీయండి సార్.
ఇట్లు,
మీ అభిమాని.