Ads
కాకతీయ వైద్య విద్యార్థి డాక్టర్ ప్రీతి అంత్యక్రియలు సోమవారం నాడు ముగిశాయి. ఆమె స్వగ్రామం అయిన గిర్నీ తండలో అంత్యక్రియల జరిపించారు. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. ఇక ప్రీతి తల్లి దండ్రులు కుమార్తెను పోగొట్టుకున్న బాధలో ఉన్నారు. వారి బంధువులు అంతా కన్నీరు పెట్టుకున్నారు.
Ads
మంచి డాక్టరుగా తన సేవలను అందించాలనుకున్న ప్రీతి కల తీరకుండానే వెళ్లిపోయిందని అక్కడి వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీతి నాన్న ఆమె గురించి మాట్లాడుతూ ప్రీతి చాలా ధైర్యం కలది. మ్యాథ్స్ అంటే ఇష్టపడేది కాదని, చిన్నప్పుడు ఏమవుతావని మా నాన్న అడిగితే డాక్టర్ అవుతాను అని చెప్పేది అన్నారు. ఎంబీబీఎస్ కోసం ఇంటర్ ఎంతో కష్టపడి చదివింది. కోచింగ్ వెల్లకుండానే ఎంబీబీఎస్ సీటు తెచ్చుకుందని తెలిపారు. కాలేజీకి దగ్గర డ్రాప్ చేసేవరమని, సినిమాలకు చాలా దూరంగా ఉండేది. ఇంట్లోనే ఎప్పుడైనా అందరం కలిసి టీవీలో సినిమాలు చూసేవారమని తెలిపారు.
కరోనా సమయంలో వైద్యురాలిగా..
కరోనా మహమ్మారి టైమ్ కి ప్రీతి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. అప్పుడు సికింద్రాబాద్ రైల్వే హాస్పటల్ లో కరోనా వార్డులో ఆమె సేవలు చేసిందని ప్రీతి తండ్రి నరేందర్ చెప్పారు. కోవిడ్ వార్డులో వద్దని ఎంతగా వారించినా ఆమె వినలేదు. ప్రీతి చాలా ధైర్యవంతురాలు. కరోనాను ధైర్యంగా ఎదుర్కొంది. కానీ ఆమె వేధింపులకు బలి అయ్యిందని అన్నారు.
మాకు కూడా అనుమానాలు ఉన్నాయి..
నా కూతురిది ప్రయాణం తీసుకోలేదని, ఆమెడి హత్య అని, మెడికల్ కాలేజీ ఆఫీసర్స్ సరైన టైమ్ కి స్పందించి, ప్రీతిని వేధించిన డాక్టర్ సైఫ్‌కు వారు కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటే నా కుమార్తె జీవించి ఉండేది. పక్షపాతం లేకుండా సిట్టింగ్ జడ్జీతో ఎంక్వైరీ జరిపితే అన్ని విషయాలన్నీ తెలుస్తాయన్న నమ్మకం ఉందని అన్నారు.
మంత్రి కేటీఆర్ -ఎవరినీ వదిలి పెట్టం..
డాక్టర్ ప్రీతి కేసులో నేరం చేసిన వారు ఎంత పెద్ద వారైనా సరే శిక్షిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రీతి ఫ్యామిలికి గవర్నమెంట్, పార్టీ తరపున కూడా అండగా ఉంటామని, ప్రీతి అన్యాయం చేసింది సైఫ్ లేదా సంజయ్ ఎవరైనా వారిని వదలిపెట్టమని ఆయన చెప్పారు.
Also Read: ప్రధాని మోదీ హృదయాన్ని తాకిన రెండవ తరగతి బాలుడి లేఖ..