బాహుబలి మూవీలో కట్టప్ప క్యారెక్టర్ ని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

Ads

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రం దేశవ్యాప్తంగా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా ఈ మూవీతోనే పాన్ ఇండియా చిత్రాలు రావడం మొదలు అయ్యాయని చెప్పవచ్చు.

Ads

సౌత్ మూవీస్ నార్త్ చిత్రాలకంటే ఎంతమాత్రం తక్కువ కాదని నిరూపించిన తొలి సినిమా బాహుబలి. అంతేకాకుండా ఈ చిత్రంతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మారాడు. ఈ సినిమాలో నటించిన రానా, అనుష్క, రమ్యకృష్ణ,నాజర్, సత్యరాజ్ నటించారు. రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రంలో బాహుబలి క్యారెక్టర్ తరువాత కీలకమైన క్యారెక్టర్స్ లో కట్టప్ప ఒకటి. మొదటి భాగంలో బాహుబలి వెన్నంటే నమ్మకంగా ఉంటూ బాహుబలిని వెనుక నుండి పొడుస్తాడు కట్టప్ప. ఇక అంత నమ్మకంగా, ప్రేమగా ఉండే కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడు అనే అంశాన్ని ఒక చిక్కు ప్రశ్నగా వదిలి, మొదటి భాగాన్ని ముగించాడు జక్కన్న. ఆ తరువాత వచ్చిన రెండో భాగంలో కూడా కట్టప్ప పాత్ర చాలా ముఖ్యమైనది. ఇక ఈ మూవీలో ఆ క్యారెక్టర్ కి చాలా ప్రాధాన్యత ఉండడంతో మొదట కట్టప్ప పాత్ర కోసం దర్శకుడు రాజమౌళి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ని సంప్రదించినట్లుగా సమాచారం. అయితే మోహన్ లాల్ కి ఆ క్యారెక్టర్ నచ్చకపోవడంతో దాన్ని తిరస్కరించారని తెలుస్తోంది. ఈ సినిమా విడుదల అయిన తరువాత కట్టప్ప పాత్రకి మంచి పేరు వచ్చింది. దాంతో మోహన్ లాల్ కట్టప్ప పాత్ర చేస్తే మరింత హైలెట్ అయ్యేదని తన సన్నిహితులతో అన్నట్టు తెలిసింది.దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే సినిమాలో చిన్న పాత్ర వచ్చిన చేయాలనే ఉదేశ్యంలో ఎంతో మంది నటీనటులు ఎదురుచూస్తున్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఒకసారి జక్కన్న చిత్రంలో నటిస్తే, వాళ్ళకు 10 ఏళ్ల వరకు ఇండస్ట్రీలో కెరీర్ కొనసాగుతుంది. అందువల్ల రాజమౌళితో ఒక్క సినిమా అయిన చేయాడం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పాన్ వరల్డ్ సినిమా ప్రకటించారు. స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు.

Also Read: బాహుబ‌లి సినిమాలో భ‌ళ్లాలదేవుని ముఖం పై ఉన్న ఈ గాయం ఎలా అయ్యిందో గుర్తుందా?

Previous articleUgadi Telugu Images 2023 | Happy Ugadi Wishes, Images Quotes Collection 2023
Next articleతారకరత్న గురించి ఎన్టీఆర్ ‘అమిగోస్’ ఈవెంట్‌లో మాట్లాడకపోవడం వెనుక ఉన్న కారణం ఏమిటో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.