తారకరత్న గురించి ఎన్టీఆర్ ‘అమిగోస్’ ఈవెంట్‌లో మాట్లాడకపోవడం వెనుక ఉన్న కారణం ఏమిటో తెలుసా?

Ads

బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పటల్ లో నందమూరి తారకరత్న చికిత్స పొందుతున్న విషయం అందరికి తెలిసిందే. వైద్యులు తారకరత్న కోసం ఎంతగానో శ్రమిస్తున్నారు. ఆయనకు అత్యుత్తమమైన ట్రీట్మెంట్ ని అందజేస్తున్నారు.

అయినప్పటికీ ఆయన ఇంకా స్పృహలోకి రాకపోవడంతో నందమూరి కుటుంబం ఆందోళనలో ఉంది. ఇటు నందమూరి అభిమానులు, అటు టిడిపి శ్రేణులు కూడా తారకరత్న ఆరోగ్యం గురించి ఆందోళన పడుతున్నారు. ఆయన కొలుకోవాలని పూజలు, ప్రార్ధనలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే కుటుంబసభ్యులు ఫంక్షన్స్ కి దూరంగా ఉంటూంటారు. కానీ నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘అమిగోస్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హాజరు కావాల్సి వచ్చింది.
ఈ చిత్రం యొక్క రిలీజ్ డేట్ దగ్గరలోనే ఉంది. ఇక ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ఫిబ్రవరి 10న అని గతంలోనే నిర్ణయించారు. ఆరోగ్యంగా ఉన్న తారకరత్నకు సడెన్ గా ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేరు. మేకర్స్ ఈ సినిమాకు భారీగా ఖర్చు పెట్టి నిర్మించారు. ఇక తమ కారణంగా నిర్మాతలకు ఎలాంటి నష్టం వాటిల్లకూడదని బాధలోనూ సోదరులిద్దరు ఈ మూవీ ఈవెంట్ కి హాజరు అయ్యారు. మేకర్స్ అనుకున్నట్టుగానే ఈ వేడుక పూర్తి అయ్యింది. ఇక ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ అంత సీరియస్ కండిషన్ లో ఉన్న తారకరత్న గురించి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు అనే చర్చ మొదలు అయ్యింది.

Ads

అలా మాట్లాడకపోవడానికి కారణం ఏమిటని, తారకరత్న ఆరోగ్యం గురించి అప్డేట్ ఇస్తే బాగుండేది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తారకరత్న కోసం బెంగళూరు దాకా వెళ్లి ఆరోగ్యం గురించి వైద్యులతో మాట్లాడి తెలుసుకున్న బ్రదర్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన గురించి మాట్లాడకపోవడం పై కొందరు అభిమానులు పెదవి విరుస్తున్నారు. కాగా ఎన్టీఆర్ తారకరత్న గురించి మాట్లాడకపోవడానికి మరొక రీజన్ ఉందనే టాక్ కూడా నడుస్తోంది. అది ఏమిటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టిన కారణం వేరు. ఈ వేడుక పూర్తిగా మూవీకి చెందిన ఈవెంట్.

ఇక్కడకు వచ్చే అభిమానులు సినిమా మూడ్ తో వస్తారు. అలాంటి ఆనంద సమయంలో తమ వ్యక్తిగత విషయాల గురించి కానీ, ఫ్యామిలీ గురించి కానీ మాట్లాడి ఈవెంట్ కి వచ్చిన వారి మూడ్ కి భంగం కలిగించకూడదనే ఉద్దేశ్యంతోనే కళ్యాణ్ రామ్ మరియు ఎన్టీఆర్ తారకరత్న గురించి మాట్లాడలేదు అనే వార్త షికారు చేస్తోంది. అంతేకాకుండా ఒకవేళ మాట్లాడిన కూడా సింపతీ కోసం మాట్లాడినట్లుగా ఉంటుందని నందమూరి బ్రదర్స్ తమ బాధను బయటికి కనిపించకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెయింటెయిన్ చేశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Also Read: తారకరత్నహెల్త్ కండిషన్ సీరియస్.. విదేశాలకు తరలించే ఆలోచన..

Previous articleబాహుబలి మూవీలో కట్టప్ప క్యారెక్టర్ ని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
Next article1965 ”హోటల్ బిల్” ని చూసారా..? అప్పుడు ధరల్ని చూస్తే షాక్ అవుతారు..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.