Ads
గత కొద్ది సంవత్సరాల నుండి ఓటీటీ రిలీజ్ లు ఎక్కువైపోతున్నాయి. ఎన్నో సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవ్వకుండా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అవుతున్నాయి. అయితే, ఇలాంటి కాన్సెప్ట్ ని మొదలుపెట్టిన మొదటి తెలుగు సినిమా ఒకటి ఉంది. ఆ సినిమాని రానా దగ్గుబాటి నిర్మించడం విశేషం. ఆ సినిమా పేరు కృష్ణ అండ్ హిజ్ లీల. డీజే టిల్లు సినిమాతో అందరికీ చేరువ అయిన సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాలో హీరోగా నటించారు.
క్షణం సినిమాకి దర్శకత్వం వహించిన రవికాంత్ పేరేపు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి సిద్దు జొన్నలగడ్డ డైలాగ్స్, ఎడిటింగ్ డిపార్ట్మెంట్స్ లో కూడా పనిచేశారు. శ్రీ చరణ్ పాకాల ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు. జెర్సీ సినిమా హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వడ్నికట్టి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. కృష్ణ అనే ఒక అబ్బాయి ఒకేసారి ఇద్దరు అమ్మాయిలని ప్రేమిస్తాడు. ఆ తర్వాత జరిగే సంఘటనలు ఏంటి అనే విషయాన్ని ఈ సినిమాలో చూపించారు. సినిమా ఒక ప్రేమ కథ. యూత్ కి కనెక్ట్ అయ్యే చాలా అంశాలు ఈ సినిమాలో ఉంటాయి.
Ads
సాధారణంగా ప్రేమ అనే విషయంలో చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. ఈ సినిమాలో హీరో కూడా అలాగే ఎన్నో తెలిసి తెలియని నిర్ణయాలు తీసుకుంటాడు. ఈ సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. అంతే కాకుండా, నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. 2020 లో ఈ సినిమా విడుదల అయ్యింది. ఝాన్సీ, సంపత్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. హీరో తల్లిదండ్రులుగా వీళ్ళు పోషించిన పాత్రలు, ఆ పాత్రల ప్రవర్తనకి ఉన్న అర్థం కూడా ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. చివరిలో హీరో తీసుకునే నిర్ణయం, క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే డిస్కషన్ సీన్స్ సినిమాకి హైలైట్ అయ్యాయి.
సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందింది అని సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడే ఒక సందేశం ఇస్తారు. చూస్తున్నంత సేపు కూడా, నిజ జీవిత సంఘటనల లాగానే చాలా సంఘటనలు అనిపిస్తాయి. సినిమాలో ఉండే పాత్రలు కూడా, అసలు రియాలిటీకి దగ్గరగా లేని పాత్రలలాగా కాకుండా, చాలా సహజంగా ఉండేలాగా రాసుకున్నారు. మనుషుల మనస్తత్వాలు ఈ సినిమాలో చూపించారు. కొన్ని డైలాగ్స్ కూడా చాలా బాగా రాసుకొని, సీన్స్ కూడా అంతే బాగా తెర మీద చూపించారు.
ALSO READ : ఈ 7 మంది డైరెక్టర్లకి ఈ 7 మంది హీరోయిన్లు చాలా ఫేవరెట్…వారి కాంబినేషన్ లో అన్ని హిట్లే.!